అంటుకొంటి విఁకనో ఆయఁగా రట్టు
(॥పల్లవి॥)
అంటుకొంటి విఁకనో ఆయఁగా రట్టు
కంటగించ కంతలోనె కాఁగిలించుకొంటివి
(॥అంటు॥)
చెఱఁగుమాసినసుద్ది చెలితో నేఁ జెప్పఁగను
యెఱుకలుసేసుకొనే వేఁటికి నీకు
చిఱుతనవ్వులు నవ్వి సిగ్గుపడి నే నుండితే
వొఱపుతోడను వచ్చివొద్దఁ గూచుండితివి
(॥అంటు॥)
నాలునాళ్లు సేసేనని నాతులఁ బిలిచితేను
యీలీల నదేమనేవు యేఁటికి నీకు
మైలవాసి నేనిటు మఱఁగున నుండఁగాను
పోలిమి నెంగిలిచోటు పొలసి తొక్కితివి
(॥అంటు॥)
పాయపుమదముతోఁ బడఁతుల జూచితేను
యీయెడ నేకతమాడే వేఁటికి నీకు
చాయల శ్రీవేంకటేశ జంట ననుఁ గూడితివి
పాయ నీచేయి దాఁకెఁ బట్టినకాళాఁజి
(||pallavi||)
aṁṭugŏṁṭi vim̐kano āyam̐gā raṭṭu
kaṁṭagiṁcha kaṁtalonĕ kām̐giliṁchugŏṁṭivi
(||aṁṭu||)
sĕṟam̐gumāsinasuddi sĕlido nem̐ jĕppam̐ganu
yĕṟugalusesugŏne vem̐ṭigi nīgu
siṟudanavvulu navvi siggubaḍi ne nuṁḍide
vŏṟabudoḍanu vachchivŏddam̐ gūsuṁḍidivi
(||aṁṭu||)
nālunāḽlu sesenani nādulam̐ bilisidenu
yīlīla nademanevu yem̐ṭigi nīgu
mailavāsi neniḍu maṟam̐guna nuṁḍam̐gānu
polimi nĕṁgilisoḍu pŏlasi tŏkkidivi
(||aṁṭu||)
pāyabumadamudom̐ baḍam̐tula jūsidenu
yīyĕḍa negadamāḍe vem̐ṭigi nīgu
sāyala śhrīveṁkaḍeśha jaṁṭa nanum̐ gūḍidivi
pāya nīseyi dām̐kĕm̐ baṭṭinagāḽām̐ji