అంటినా తన్నేమైనా నావగింజంతైనా మాట
(॥పల్లవి॥)
అంటినా తన్నేమైనా నావగింజంతైనా మాట
కంటిచూపు తాఁ జూచె కన్నలలో నున్నవి (ది?)
(॥అంటి॥)
ఆయలేవే తనమాట కందాలు చెప్పఁగవచ్చీ
చాయసేసుకొన్నఁ బోఁడు సాదించీని
చేయారఁ దనమేనిచిన్న లివె చేనిపంట
కోయిలకాలే చెప్పీఁ గోప మేఁటికనవే
(॥అంటి॥)
పోనీవే తనుఁదానె పొగడీఁ దన నిజము
మానేనన్నాఁ బోనీఁడు మళ్లఁదీసీని
అనలేలే తనగుణ మదె గొండంటి మెత్తన
నానఁగానే కానవచ్చీ నయమైతేఁగనక
(॥అంటి॥)
కద్దులేవే తనకాఁక కాఁగిటనే చూపవచ్చీ
వొద్దన్నా మానఁడు నాపై వొళ్లు వేసీని
వొద్దికె శ్రీవేంకటేశుఁ డొనగూడె తననేర్పు
తిద్దనేల నీరుకొలఁది తామెర గాదా
(||pallavi||)
aṁṭinā tannemainā nāvagiṁjaṁtainā māḍa
kaṁṭisūbu tām̐ jūsĕ kannalalo nunnavi (di?)
(||aṁṭi||)
āyaleve tanamāḍa kaṁdālu sĕppam̐gavachchī
sāyasesugŏnnam̐ bom̐ḍu sādiṁchīni
seyāram̐ danamenisinna livĕ senibaṁṭa
koyilagāle sĕppīm̐ goba mem̐ṭiganave
(||aṁṭi||)
ponīve tanum̐dānĕ pŏgaḍīm̐ dana nijamu
mānenannām̐ bonīm̐ḍu maḽlam̐dīsīni
analele tanaguṇa madĕ gŏṁḍaṁṭi mĕttana
nānam̐gāne kānavachchī nayamaidem̐ganaga
(||aṁṭi||)
kadduleve tanagām̐ka kām̐giḍane sūbavachchī
vŏddannā mānam̐ḍu nābai vŏḽlu vesīni
vŏddigĕ śhrīveṁkaḍeśhum̐ ḍŏnagūḍĕ tananerbu
tiddanela nīrugŏlam̐di tāmĕra gādā