Amtesi doradanaala yaage yeebe

అంతేసి దొరతనాల యాకె యీపె
Language

(॥పల్లవి॥)
అంతేసి దొరతనాల యాకె యీపె
కొంతపుఁజూపులఁ జట్టిగొని నాకె యీపె

(॥అంతే॥)
మట్టుమీరి లేకలంపి మాటమాత్రముననే
అట్టె యింటికి రప్పించినాకె యీపె
చుట్టమవలెను నీసొమ్ములెల్లాఁ దనమెడఁ
బెట్టుకొని నిన్ను మెప్పించినయాకె యీపె

(॥అంతే ॥)
చెంగటనే సేయరానిచేత సేసి నీవలపు-
లంగడిఁబెట్టినయట్టియాకె యీపె
కొంగువట్టి నీతోను కూరిములు గొసరుచు
అంగవించి చన్నులొత్తినాకె యీపె

(॥అంతే॥)
సెలవుల నవ్వునవ్వి చెక్కులు నొక్కుచు నిన్ను-
నలుకలుదీర్చినయాకె యీపె
అలమేలుమంగను నేననఁగా శ్రీవేంకటేశ
కలసితి విదే నాసంగడియాకె యీపె

(||pallavi||)
aṁtesi dŏradanāla yāgĕ yībĕ
kŏṁtabum̐jūbulam̐ jaṭṭigŏni nāgĕ yībĕ

(||aṁte||)
maṭṭumīri legalaṁpi māḍamātramunane
aṭṭĕ yiṁṭigi rappiṁchināgĕ yībĕ
suṭṭamavalĕnu nīsŏmmulĕllām̐ danamĕḍam̐
bĕṭṭugŏni ninnu mĕppiṁchinayāgĕ yībĕ

(||aṁte ||)
sĕṁgaḍane seyarāniseda sesi nīvalabu-
laṁgaḍim̐bĕṭṭinayaṭṭiyāgĕ yībĕ
kŏṁguvaṭṭi nīdonu kūrimulu gŏsarusu
aṁgaviṁchi sannulŏttināgĕ yībĕ

(||aṁte||)
sĕlavula navvunavvi sĕkkulu nŏkkusu ninnu-
nalugaludīrsinayāgĕ yībĕ
alamelumaṁganu nenanam̐gā śhrīveṁkaḍeśha
kalasidi vide nāsaṁgaḍiyāgĕ yībĕ