అంతకోపుదుమా నేము అవునే తాను
(॥పల్లవి॥)
అంతకోపుదుమా నేము అవునే తాను
పంతమా నాతో నింత భళా తాను
(॥అంత॥)
రెప్పలెత్తి నన్నుఁ జూచె రేసులకే తలవంచె -
నప్పటిని మగనాలి నద్దో తాను
తప్పక మోము గిరిపె తనలోనే తానవ్వె
ఇపుడే తా మానఁడుగా యెవ్వఁడే తాను
(॥అంత॥)
వచ్చివచ్చి వేఁడుకొనీ వద్దంటేఁ గోపగించీ
అచ్చలము నాతోనేల అప్పటిఁ దాను
రచ్చల నెమ్మెలు చూపి రాజనంటాఁ బచ్చిసేసీ
యెచ్చుకుందు తనకు నా కేడకేడే తాను
(॥అంత॥)
బుద్దులు చెప్పఁగ వచ్చి పూఁచినవాకిళ్లు దాఁటి
అద్దమరేతిరికాడ నాయఁగా తాను
దిద్దుచు శ్రీవేంకటాద్రిదేవుఁడు నన్నిటు గూడె
వొద్ద నుండి ఇంత సేయ నోపునా తాను
(||pallavi||)
aṁtagobudumā nemu avune tānu
paṁtamā nādo niṁta bhaḽā tānu
(||aṁta||)
rĕppalĕtti nannum̐ jūsĕ resulage talavaṁchĕ -
nappaḍini maganāli naddo tānu
tappaga momu giribĕ tanalone tānavvĕ
ibuḍe tā mānam̐ḍugā yĕvvam̐ḍe tānu
(||aṁta||)
vachchivachchi vem̐ḍugŏnī vaddaṁṭem̐ gobagiṁchī
achchalamu nādonela appaḍim̐ dānu
rachchala nĕmmĕlu sūbi rājanaṁṭām̐ bachchisesī
yĕchchuguṁdu tanagu nā keḍageḍe tānu
(||aṁta||)
buddulu sĕppam̐ga vachchi pūm̐sinavāgiḽlu dām̐ṭi
addamaredirigāḍa nāyam̐gā tānu
diddusu śhrīveṁkaḍādridevum̐ḍu nanniḍu gūḍĕ
vŏdda nuṁḍi iṁta seya nobunā tānu