అంతటిపై నీవు చెప్పినట్టే సేసేఁగాని
(॥పల్లవి॥)
అంతటిపై నీవు చెప్పినట్టే సేసేఁగాని
పంతమాడ కందాఁకా పండరంగి విట్ఠలా
(॥అంత॥)
చెదిరినకురు లివి చెరిగినందాఁకను
పదరకు మంత నీవు పండరంగివిట్ఠలా
వదలుఁబయ్యదకొంగు వైపుగాఁ బెట్టినదాఁకా
పదిమారులు నవ్వకు పండరంగివిట్ఠలా
(॥అంత॥)
చిక్కువడ్డహారములు చేతదిద్దునందాఁకా
పక్కనఁ జెనకకుమీ పండరంగివిట్ఠలా
చెక్కులనూనినయట్టిచెమట లారినదాఁకా
పక్కన వోరుచు పండరంగివిట్ఠలా
(॥అంత॥)
చలువనీమోవితేనె చవిగొన్న యందాఁకా
పలుకులు చాలించు పండరంగివిట్ఠలా
చెలఁగి కూడితి విట్టె శ్రీవేంకటాద్రిమీఁద
బలిమి నీకె చెల్లెఁ బండరంగివిట్ఠలా
(||pallavi||)
aṁtaḍibai nīvu sĕppinaṭṭe sesem̐gāni
paṁtamāḍa kaṁdām̐kā paṁḍaraṁgi viṭṭhalā
(||aṁta||)
sĕdirinaguru livi sĕriginaṁdām̐kanu
padaragu maṁta nīvu paṁḍaraṁgiviṭṭhalā
vadalum̐bayyadagŏṁgu vaibugām̐ bĕṭṭinadām̐kā
padimārulu navvagu paṁḍaraṁgiviṭṭhalā
(||aṁta||)
sikkuvaḍḍahāramulu sedadiddunaṁdām̐kā
pakkanam̐ jĕnagagumī paṁḍaraṁgiviṭṭhalā
sĕkkulanūninayaṭṭisĕmaḍa lārinadām̐kā
pakkana vorusu paṁḍaraṁgiviṭṭhalā
(||aṁta||)
saluvanīmovidenĕ savigŏnna yaṁdām̐kā
palugulu sāliṁchu paṁḍaraṁgiviṭṭhalā
sĕlam̐gi kūḍidi viṭṭĕ śhrīveṁkaḍādrimīm̐da
balimi nīgĕ sĕllĕm̐ baṁḍaraṁgiviṭṭhalā