Amtadi baluvuraala vauduve neevu

అంతటి బలువురాల వౌదువే నీవు
Language

(॥పల్లవి॥)
అంతటి బలువురాల వౌదువే నీవు
చెంత నుండి మచ్చికలు సేయించుకొంటివి

(॥అంత॥)
వలసినచోటికి వాసు లెంతురటవే
పిలిపించుకొంటివి ప్రియునిచేత
మలసే నీ పంతాలు మగనితోడనా
యెలమిఁ జేతికి విడె మిప్పించుకొంటివి

(॥అంత॥)
ఆసపడి వున్నచోట అలయింతురటవే
బాస సేఇంచుకొంటివి పతిచేతను
యీసట లీతరితీపు లిక్కడఁ జూపుదురా
రాసికెక్క నింటికిని రప్పించుకొంటివి

(॥అంత॥)
వొక్కటైనచోటికి వొడ్డింకొందురటనే
చెక్కు నొక్కించుకొంటివి చెల్వునిచేత
వెక్కసపునేర్పులు శ్రీవేంకటేశుకొరకా
మిక్కిలి యీతనిచేత మెప్పించుకొంటివి

(||pallavi||)
aṁtaḍi baluvurāla vauduve nīvu
sĕṁta nuṁḍi machchigalu seyiṁchugŏṁṭivi

(||aṁta||)
valasinasoḍigi vāsu lĕṁturaḍave
pilibiṁchugŏṁṭivi priyuniseda
malase nī paṁtālu maganidoḍanā
yĕlamim̐ jedigi viḍĕ mippiṁchugŏṁṭivi

(||aṁta||)
āsabaḍi vunnasoḍa alayiṁturaḍave
bāsa seiṁchugŏṁṭivi padisedanu
yīsaḍa līdaridību likkaḍam̐ jūbudurā
rāsigĕkka niṁṭigini rappiṁchugŏṁṭivi

(||aṁta||)
vŏkkaḍainasoḍigi vŏḍḍiṁkŏṁduraḍane
sĕkku nŏkkiṁchugŏṁṭivi sĕlvuniseda
vĕkkasabunerbulu śhrīveṁkaḍeśhugŏragā
mikkili yīdaniseda mĕppiṁchugŏṁṭivi