Amtadam boneeyaraa ninnaayamulamti karamsi

అంతటఁ బోనీయరా నిన్నాయములంటి కరఁచి
Language

(॥పల్లవి॥)
అంతటఁ బోనీయరా నిన్నాయములంటి కరఁచి
చింతదీర నప్పుడు నే సెలవిత్తుఁ గాని

(॥అంత॥)
యెక్కడో దవ్వాది చెవి నిడుక వచ్చినప్పుడు నా
చెక్కులఁ బూసుటే రతి సెలవా నాకు
దక్కించు కన్నిపనులు దండకువ చ్చొకమాటు
చిక్కని నవ్వు నవ్వితే సెలవా నాకు

(॥అంత॥)
యే యెడనో భోగించి యింటికి నిట్టె వచ్చి
చేయి మీఁద వేసితేనే సెలవా నాకు
చాయలకుఁ దిరిగాడి చక్కటికి నీవు సే సే
సేయరాని వినయాలే సెలవా నాకు

(॥అంత॥)
ఆసలక్కడ నిండించి అందరూఁ జూడఁగా నన్నుఁ
జేసుకొంటి వింతలోనే సెలవా నాకు
వాసికి శ్రీ వేంకటేశ వడి నొకమాటే నాతో
సేసవెట్టి కూడితివి సెలవా నాకు

(||pallavi||)
aṁtaḍam̐ bonīyarā ninnāyamulaṁṭi karam̐si
siṁtadīra nappuḍu ne sĕlavittum̐ gāni

(||aṁta||)
yĕkkaḍo davvādi sĕvi niḍuga vachchinappuḍu nā
sĕkkulam̐ būsuḍe radi sĕlavā nāgu
dakkiṁchu kannibanulu daṁḍaguva schŏgamāḍu
sikkani navvu navvide sĕlavā nāgu

(||aṁta||)
ye yĕḍano bhogiṁchi yiṁṭigi niṭṭĕ vachchi
seyi mīm̐da vesidene sĕlavā nāgu
sāyalagum̐ dirigāḍi sakkaḍigi nīvu se se
seyarāni vinayāle sĕlavā nāgu

(||aṁta||)
āsalakkaḍa niṁḍiṁchi aṁdarūm̐ jūḍam̐gā nannum̐
jesugŏṁṭi viṁtalone sĕlavā nāgu
vāsigi śhrī veṁkaḍeśha vaḍi nŏgamāḍe nādo
sesavĕṭṭi kūḍidivi sĕlavā nāgu