పల్లవి:
అంతా రామమయం !
ఈ జగమంతా రామమయం !!
రామ రామ రామ రామ రామ రామ రామ
అంతా రామమయం ..ఈ జగమంతా రామమయం !
అంతా రామమయం ..ఈ జగమంతా రామమయం !!
అంతా రామమయం !!!
చరణం 1:
అంతరంగమున ఆత్మారాముడు..
రామ రామ రామ రామ రామ రామ రామ
అనంత రూపముల వింతలు సలుపగ
రామ రామ రామ రామ రామ రామ రామ
సోమసూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీజంబులు
అంతా రామమయం ..ఈ జగమంతా రామమయం !
అంతా రామమయం !!
ఓం నమో నారాయణాయ !
ఓం నమో నారాయణాయ !!
ఓం నమో నారాయణాయ !!!
చరణం 2:
అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగ
నదులు వనంబులు నానమృగములు పీత కర్మములు వేద శాస్త్రములు
అంతా రామమయం ..ఈ జగమంతా రామమయం !
రామ రామ రామ రామ రామ రామ రామ !
చరణం 3:
సిరికింజెప్పడు, శంఖుచక్రయుగముం జేదోయి సంధింప డే
పరివారంబును జీర డభ్రగపతిన్ బన్నింప డాకర్ణికాం
తరధమ్మిలమ్ము జక్కనొత్తడు వివాదప్రోత్థిత శ్రీకుచో
పరి చేలాంచలమైన వీడడు, గజప్రాణావనోత్సాహియై
pallavi:
aṁtā rāmamayaṁ !
ī jagamaṁtā rāmamayaṁ !!
rāma rāma rāma rāma rāma rāma rāma
aṁtā rāmamayaṁ ..ī jagamaṁtā rāmamayaṁ !
aṁtā rāmamayaṁ ..ī jagamaṁtā rāmamayaṁ !!
aṁtā rāmamayaṁ !!!
saraṇaṁ 1:
aṁtaraṁgamuna ātmārāmuḍu..
rāma rāma rāma rāma rāma rāma rāma
anaṁta rūbamula viṁtalu salubaga
rāma rāma rāma rāma rāma rāma rāma
somasūryulunu suralu tāralunu ā mahāṁbudhulu avanījaṁbulu
aṁtā rāmamayaṁ ..ī jagamaṁtā rāmamayaṁ !
aṁtā rāmamayaṁ !!
oṁ namo nārāyaṇāya !
oṁ namo nārāyaṇāya !!
oṁ namo nārāyaṇāya !!!
saraṇaṁ 2:
aṁḍāṁḍaṁbulu piṁḍāṁḍaṁbulu brahmāṁḍaṁbulu brahmalu mŏdaluga
nadulu vanaṁbulu nānamṛgamulu pīda karmamulu veda śhāstramulu
aṁtā rāmamayaṁ ..ī jagamaṁtā rāmamayaṁ !
rāma rāma rāma rāma rāma rāma rāma !
saraṇaṁ 3:
sirigiṁjĕppaḍu, śhaṁkhusakrayugamuṁ jedoyi saṁdhiṁpa ḍe
parivāraṁbunu jīra ḍabhragabadin banniṁpa ḍāgarṇigāṁ
taradhammilammu jakkanŏttaḍu vivādaprotthida śhrīguso
pari selāṁchalamaina vīḍaḍu, gajaprāṇāvanotsāhiyai