అంతా నీ మహిమే ఆఁటది యేమి యెఱుఁగు
(॥పల్లవి॥)
అంతా నీ మహిమే ఆఁటది యేమి యెఱుఁగు
పొంతల మమ్మెంత నీవు పొగడేవయ్యా
(॥అంతా॥)
నీ వెవ్వెతె మన్నించినా నేరుపు గలమ్మ యాపె
భావించి చూచితేనే పట్టముదాపె
కైవసము నీవైతేనే కలికితనాలదాపె
పోవులుగ మమ్ము నేమి పొగడే వయ్యా
(॥అంతా॥)
సెలవి నీవు నవ్వితే సేసిన పుణ్యము దాపె
పలికితే నన్నిటాను బలిమి దాపె
సలిగె యిచ్చినప్పుడే సర్వానకుఁ గర్త యాపె
పొలసి మమ్మే యెంత పొగడేవయ్యా
(॥అంతా॥)
కాఁగిట నీవు కూడితే కలిమిగలది యాపె
ఆఁగి కూడితి శ్రీ వేంకటాధిప నన్ను
పీఁగి యాపెననిందాఁకా పేరుకొంటి నన్ను నేనే
పోఁగెత్తి యట్లా నన్నుఁ బొగడేవయ్యా
(||pallavi||)
aṁtā nī mahime ām̐ṭadi yemi yĕṟum̐gu
pŏṁtala mammĕṁta nīvu pŏgaḍevayyā
(||aṁtā||)
nī vĕvvĕdĕ manniṁchinā nerubu galamma yābĕ
bhāviṁchi sūsidene paṭṭamudābĕ
kaivasamu nīvaidene kaligidanāladābĕ
povuluga mammu nemi pŏgaḍe vayyā
(||aṁtā||)
sĕlavi nīvu navvide sesina puṇyamu dābĕ
paligide nanniḍānu balimi dābĕ
saligĕ yichchinappuḍe sarvānagum̐ garda yābĕ
pŏlasi mamme yĕṁta pŏgaḍevayyā
(||aṁtā||)
kām̐giḍa nīvu kūḍide kalimigaladi yābĕ
ām̐gi kūḍidi śhrī veṁkaḍādhiba nannu
pīm̐gi yābĕnaniṁdām̐kā perugŏṁṭi nannu nene
pom̐gĕtti yaṭlā nannum̐ bŏgaḍevayyā