Amta sigguvadaga neevaanadeevayyaa nee

అంత సిగ్గువడక నీవానతీవయ్యా నీ
Language

(॥పల్లవి॥)
అంత సిగ్గువడక నీవానతీవయ్యా నీ-
యంతరంగమేల దాఁచ నానతీవయ్యా

(॥అంత॥)
కడుసరుసుఁడవట ఘనుడ నీమోమందు-
నడరిన కళలెల్ల నానతీవయ్యా
వొడికమై నీమోవినున్న కెంపు లివి యెన్ని
అడియాలముగ నాకు నానతీవయ్యా

(॥అంత॥)
మిక్కిలిజాణఁడవట మేనిమీఁదిచెమటలు
అక్కట యెందుండి వచ్చె నానతీవయ్యా
గుక్క కిట్టె యేయింతిగుబ్బలపైకుంకుమో నీ-
యక్కుమీద నంటినది యానతీవయ్యా

(॥అంత॥)
యెసఁగి శ్రీవేంకటేశ యిట్టె కాఁగిటిలోన
నసురుసురేల వచ్చె నానతీవయ్యా
ముసిముసినగవుతో మునిఁగి నాకొనగోరి-
కసమిచ్చి యేల లోఁగే వానతీవయ్యా

(||pallavi||)
aṁta sigguvaḍaga nīvānadīvayyā nī-
yaṁtaraṁgamela dām̐sa nānadīvayyā

(||aṁta||)
kaḍusarusum̐ḍavaḍa ghanuḍa nīmomaṁdu-
naḍarina kaḽalĕlla nānadīvayyā
vŏḍigamai nīmovinunna kĕṁpu livi yĕnni
aḍiyālamuga nāgu nānadīvayyā

(||aṁta||)
mikkilijāṇam̐ḍavaḍa menimīm̐disĕmaḍalu
akkaḍa yĕṁduṁḍi vachchĕ nānadīvayyā
gukka kiṭṭĕ yeyiṁtigubbalabaiguṁkumo nī-
yakkumīda naṁṭinadi yānadīvayyā

(||aṁta||)
yĕsam̐gi śhrīveṁkaḍeśha yiṭṭĕ kām̐giḍilona
nasurusurela vachchĕ nānadīvayyā
musimusinagavudo munim̐gi nāgŏnagori-
kasamichchi yela lom̐ge vānadīvayyā