Amta doddadaanavaa amdarigamte neeve

అంత దొడ్దదానవా అందరికంటె నీవే
Language

(॥పల్లవి॥)
అంత దొడ్దదానవా అందరికంటె నీవే
మంతుకెక్క నీవే ముందు మాటలేలాడేవే

(॥అంత॥)
వంతులకే పెనఁగేవు వాసులకే వచ్చేవు
ఇంతయుఁ గానవచ్చె నీ యెమ్మెలు నేఁడు
బంతినే సతులకెల్ల బాగా లాతఁ డియ్యఁగాను
చెంత నీవు ముందే వచ్చి చెయ్యేల చాఁచావే

(॥అంత॥)
తప్పక మోము చూచేవు తగవులే వెదకేవు
చెప్పరాదే నీపగటు చెలులలోన
అప్పటిఁ బొత్తుల నాతఁ డందరిని నిడుకోఁగా
కప్పి ముందే డి నీవు గ్కన నే లెత్తేవే

(॥అంత॥)
దొరతనాలు సేసేవు తొంటివావులు చెప్పేవు
సరవి నన్నిటా నీవు జాణవౌదువే
యిరవై శ్రీవేంకటేశుఁ డిందరినిఁ గూడఁగాను
వురమెక్కి ముందే రతి నోలలాడేవే

(||pallavi||)
aṁta dŏḍdadānavā aṁdarigaṁṭĕ nīve
maṁtugĕkka nīve muṁdu māḍalelāḍeve

(||aṁta||)
vaṁtulage pĕnam̐gevu vāsulage vachchevu
iṁtayum̐ gānavachchĕ nī yĕmmĕlu nem̐ḍu
baṁtine sadulagĕlla bāgā lādam̐ ḍiyyam̐gānu
sĕṁta nīvu muṁde vachchi sĕyyela sām̐sāve

(||aṁta||)
tappaga momu sūsevu tagavule vĕdagevu
sĕpparāde nībagaḍu sĕlulalona
appaḍim̐ bŏttula nādam̐ ḍaṁdarini niḍugom̐gā
kappi muṁde ḍi nīvu kkana ne lĕtteve

(||aṁta||)
dŏradanālu sesevu tŏṁṭivāvulu sĕppevu
saravi nanniḍā nīvu jāṇavauduve
yiravai śhrīveṁkaḍeśhum̐ ḍiṁdarinim̐ gūḍam̐gānu
vuramĕkki muṁde radi nolalāḍeve