అమ్మవంటిది అంత మంచిది అమ్మ ఒక్కటే
పల్లవి:
అమ్మవంటిది అంత మంచిది అమ్మ ఒక్కటే
అయ్యైనా జేజైనా అమ్మ పిమ్మటే
అమ్మవంటిది అంత మంచిది అమ్మ ఒక్కటే
అయ్యైనా జేజైనా అమ్మ పిమ్మటే
చరణం 1:
బొజ్జలోని పాపాయి పొరలి పొరలి తన్నినా
పొంగిపోవు కడుపు తీపి అమ్మది
కుసిలి కుసిలి పాలకై గుండెమీద గుద్దినా
మురిసిపోవు వెన్న మనసు అమ్మది
చరణం 2:
గోరుముద్ద తినిపిస్తూ కొండంతగ పెరగాలని
నిండుగ నూరేళ్ళు ఉండాలని కోరుతుంది
గోరుముద్ద తినిపిస్తూ కొండంతగ పెరగాలని
నిండుగ నూరేళ్ళు ఉండాలని కోరుతుంది
లాలాబోసి నీళ్లు చుట్టి రామరక్ష అంటుంది
ఆ రామునికి అమ్మకంటే రక్ష ఏమి ఉన్నదీ?
చరణం 3:
అమ్మ ఉంటే లేనిదేమీ లేనేలేదు
అమ్మ లేక ఏమి ఉన్నా ఉన్నది కాదు
అమ్మంటే త్యాగము అమ్మే ఒక యోగము
అమ్మంటే సత్యము అమ్మే సర్వస్వము
pallavi:
ammavaṁṭidi aṁta maṁchidi amma ŏkkaḍe
ayyainā jejainā amma pimmaḍe
ammavaṁṭidi aṁta maṁchidi amma ŏkkaḍe
ayyainā jejainā amma pimmaḍe
saraṇaṁ 1:
bŏjjaloni pābāyi pŏrali pŏrali tanninā
pŏṁgibovu kaḍubu tībi ammadi
kusili kusili pālagai guṁḍĕmīda guddinā
murisibovu vĕnna manasu ammadi
saraṇaṁ 2:
gorumudda tinibistū kŏṁḍaṁtaga pĕragālani
niṁḍuga nūreḽḽu uṁḍālani koruduṁdi
gorumudda tinibistū kŏṁḍaṁtaga pĕragālani
niṁḍuga nūreḽḽu uṁḍālani koruduṁdi
lālābosi nīḽlu suṭṭi rāmarakṣha aṁṭuṁdi
ā rāmunigi ammagaṁṭe rakṣha emi unnadī?
saraṇaṁ 3:
amma uṁṭe lenidemī leneledu
amma lega emi unnā unnadi kādu
ammaṁṭe tyāgamu amme ŏga yogamu
ammaṁṭe satyamu amme sarvasvamu