అంగనలఁ గనుఁగొంటే నాచారా లెక్కడ నుండు
(॥పల్లవి॥)
అంగనలఁ గనుఁగొంటే నాచారా లెక్కడ నుండు
సంగతి గాదన్నాఁ బోక సాకిరి దెలిపేవు
(॥అంగ॥)
మనసువచ్చినాపెతో మాటలాడకుండేవా
ననుపుగలచోటను నవ్వకుండేవా
చనవరిదానిమోవి చవిగొనకుండేవా
యెనయ నెందూ నంటాను యేలపెట్టే వానలు
(॥అంగ॥)
కొలువుకు వచ్చినా పెఁ గోరి చూడకుండేవా
అలమి పైకొన్నదాని నంటకుండేవా
వలచివచ్చినదానివసము గాకుండేవా
పలుమారు నాతో నీవు బాసలేల సేసేవు
(॥అంగ॥)
కడుఁబ్రేమగలయాపెఁగాఁగిలించకుండేవా
వుడివోనికూటముల కూరకుండేవా
అడరి శ్రీవేంకటేశ యలమేల్మంగపతివి
యెడయక నన్నేలితి వే లొడఁబరచేవు
(||pallavi||)
aṁganalam̐ ganum̐gŏṁṭe nāsārā lĕkkaḍa nuṁḍu
saṁgadi gādannām̐ boga sāgiri dĕlibevu
(||aṁga||)
manasuvachchinābĕdo māḍalāḍaguṁḍevā
nanubugalasoḍanu navvaguṁḍevā
sanavaridānimovi savigŏnaguṁḍevā
yĕnaya nĕṁdū naṁṭānu yelabĕṭṭe vānalu
(||aṁga||)
kŏluvugu vachchinā pĕm̐ gori sūḍaguṁḍevā
alami paigŏnnadāni naṁṭaguṁḍevā
valasivachchinadānivasamu gāguṁḍevā
palumāru nādo nīvu bāsalela sesevu
(||aṁga||)
kaḍum̐bremagalayābĕm̐gām̐giliṁchaguṁḍevā
vuḍivonigūḍamula kūraguṁḍevā
aḍari śhrīveṁkaḍeśha yalamelmaṁgabadivi
yĕḍayaga nannelidi ve lŏḍam̐barasevu