అంగడినేల వేసేవు అప్పటి వలపులు
(॥పల్లవి॥)
అంగడినేల వేసేవు అప్పటి వలపులు
యింగిత మెఱిఁగి యిట్టె యేలుకొనరాదా
(॥అంగ॥)
మంచిమాఁట లాడితేనే మనసుఁ గరఁగుదుము
కంచముపొత్తిచ్చితే కాఁతాళించము
మంచమెక్క నిచ్చితేనే మచ్చికలు సేతుము
యించుకంత చనవిచ్చి యేలుకొనరాదా
(॥అంగ॥)
చెక్కునొక్కినందుకే సేవలెల్లాఁ జేతుము
చక్కఁగాఁ జూచితేనే సమ్మతింతుము
గక్కన గొంగువట్టితే కందువకు లోనౌదుము
యిక్కువతో మన్నించి యేలుకొనరాదా
(॥అంగ॥)
చనుఁగవ లంటితేనే సరుసఁ గాఁగిలింతుము
వొనరంగ నవ్వితేనే వోరుతుము
ఘనుఁడ శ్రీవేంకటేశ కలిసితి వింతలోనే
యెనసి యట్టె లాలించి యేలుకొనరాదా
(||pallavi||)
aṁgaḍinela vesevu appaḍi valabulu
yiṁgida mĕṟim̐gi yiṭṭĕ yelugŏnarādā
(||aṁga||)
maṁchimām̐ṭa lāḍidene manasum̐ garam̐gudumu
kaṁchamubŏttichchide kām̐tāḽiṁchamu
maṁchamĕkka nichchidene machchigalu sedumu
yiṁchugaṁta sanavichchi yelugŏnarādā
(||aṁga||)
sĕkkunŏkkinaṁduge sevalĕllām̐ jedumu
sakkam̐gām̐ jūsidene sammadiṁtumu
gakkana gŏṁguvaṭṭide kaṁduvagu lonaudumu
yikkuvado manniṁchi yelugŏnarādā
(||aṁga||)
sanum̐gava laṁṭidene sarusam̐ gām̐giliṁtumu
vŏnaraṁga navvidene vorudumu
ghanum̐ḍa śhrīveṁkaḍeśha kalisidi viṁtalone
yĕnasi yaṭṭĕ lāliṁchi yelugŏnarādā