అందువంకనైనఁ గొంత అసిఁబోవుఁ దమకము
(॥పల్లవి॥)
అందువంకనైనఁ గొంత అసిఁబోవుఁ దమకము
చందురునివంటి మోము చక్కఁ జూడవయ్యా
(॥అందు॥)
సముకాన నాపె నిన్ను సారెసారె దూరఁగాను
చెమరించి చెక్కుచేతఁ జింతించేవు
చిమిడీ వలపులెల్ల చిత్తములోనే నీకు
అమర మాటకుమాట లాడవయ్య ఇఁకను
(॥అందు॥)
చేరిచేరి సణఁగుల చేతులు పైచాఁచఁగాను
వూరకే తలవంచుక వున్నాఁడవు
పేరుకొని మేనిమీఁద పెనుజవ్వనమదము
వారుకొనె సెలవుల నవ్వవయ్యఇఁకను
(॥అందు॥)
వూవులచెండున వేసిపొందు లాపె దెలుపఁగా
శ్రీవేంకటేశ్వర నీవు సిగ్గువడేవు
యీవేళనే కూడితివి యిద్దరిసేసలు నిండె
చేవదేరఁ గతలెల్లాఁ జెప్పవయ్యాయిఁకను
(||pallavi||)
aṁduvaṁkanainam̐ gŏṁta asim̐bovum̐ damagamu
saṁdurunivaṁṭi momu sakkam̐ jūḍavayyā
(||aṁdu||)
samugāna nābĕ ninnu sārĕsārĕ dūram̐gānu
sĕmariṁchi sĕkkusedam̐ jiṁtiṁchevu
simiḍī valabulĕlla sittamulone nīgu
amara māḍagumāḍa lāḍavayya im̐kanu
(||aṁdu||)
seriseri saṇam̐gula sedulu paisām̐sam̐gānu
vūrage talavaṁchuga vunnām̐ḍavu
perugŏni menimīm̐da pĕnujavvanamadamu
vārugŏnĕ sĕlavula navvavayya̮im̐kanu
(||aṁdu||)
vūvulasĕṁḍuna vesibŏṁdu lābĕ dĕlubam̐gā
śhrīveṁkaḍeśhvara nīvu sigguvaḍevu
yīveḽane kūḍidivi yiddarisesalu niṁḍĕ
sevaderam̐ gadalĕllām̐ jĕppavayyāyim̐kanu