Amdulage veragayyee nadivaro ninnum joosi

అందులకే వెరగయ్యీ నతివరో నిన్నుఁ జూచి
Language

(॥పల్లవి॥)
అందులకే వెరగయ్యీ నతివరో నిన్నుఁ జూచి
సందుకొని యాతనితో సరసములాడేవు

(॥అందు॥)
మత్తిలి నీరమణునిమనసెట్టు గంటివే
కొత్తకొత్తవలపులకోడెదానవు
యిత్తల నీతఁడిప్పుడే యెట్టు గైవసమాయనే
హత్తి కడునవ్వేవు అంతలోనే నీవు

(॥అందు॥)
కలికితనాల నెంత కాపురాలు సేసేవే
మెలకచన్నులతోడి ముద్దరాలవు
చలివాసి యంతలోనే చనపరివైతివటే
బలిమి నాతని మీరి పలికేవు నీవు

(॥అందు॥)
రాఁపుగ శ్రీవేంకటేశు రతి నెట్టు గూడితివే
పూఁపజవ్వనముతోడి పోదికత్తెవు
యేపున నలమేల్మంగ యేమి నేరుచుకొంటివే
ఆఁపరానితమితోడ నడరేవు నీవు

(||pallavi||)
aṁdulage vĕragayyī nadivaro ninnum̐ jūsi
saṁdugŏni yādanido sarasamulāḍevu

(||aṁdu||)
mattili nīramaṇunimanasĕṭṭu gaṁṭive
kŏttagŏttavalabulagoḍĕdānavu
yittala nīdam̐ḍippuḍe yĕṭṭu gaivasamāyane
hatti kaḍunavvevu aṁtalone nīvu

(||aṁdu||)
kaligidanāla nĕṁta kāburālu seseve
mĕlagasannuladoḍi muddarālavu
salivāsi yaṁtalone sanabarivaidivaḍe
balimi nādani mīri paligevu nīvu

(||aṁdu||)
rām̐puga śhrīveṁkaḍeśhu radi nĕṭṭu gūḍidive
pūm̐pajavvanamudoḍi podigattĕvu
yebuna nalamelmaṁga yemi nerusugŏṁṭive
ām̐parānidamidoḍa naḍarevu nīvu