అందుకుఁగా మమ్మేల ఆఱడిఁబెట్టీఁ దాను
(॥పల్లవి॥)
అందుకుఁగా మమ్మేల ఆఱడిఁబెట్టీఁ దాను
సందడిఁ గాలుదొక్కితే సాదించవలదా
(॥॥)
అద్దుకొని యెడమాట లాడించకుండితే నేమి
వద్దికి రాఁగాను నే వద్దనేనా
ముద్దుముద్దువలె నేను మొక్కి నిలుచుండితేను
అద్దో పరాకు సేసితే నలుగఁగవలదా
(॥॥)
చప్పుడు గాకుండా వచ్చి సన్న సేయకుంటేనేమి
కప్పురవీడె మియ్యఁగాఁ గాదనేనా
దుప్పటికొంగు వట్టితి తొలుతఁ దా రానందుకు
కొప్పువట్టి తీసి నేను కోపగించవలదా
(॥॥)
సేనలుగాఁ బ్రియములు చెప్పకుండితే నేమి
తెనేమోవిచ్చితే సమ్మతించననేనా
తానే శ్రీవేంకటేశుఁడు తగిలి నేఁ గూడితేను
పూని యలసినందుకు పోదిసేయవలదా
(||pallavi||)
aṁdugum̐gā mammela āṟaḍim̐bĕṭṭīm̐ dānu
saṁdaḍim̐ gāludŏkkide sādiṁchavaladā
(||||)
addugŏni yĕḍamāḍa lāḍiṁchaguṁḍide nemi
vaddigi rām̐gānu ne vaddanenā
muddumudduvalĕ nenu mŏkki nilusuṁḍidenu
addo parāgu seside nalugam̐gavaladā
(||||)
sappuḍu gāguṁḍā vachchi sanna seyaguṁṭenemi
kappuravīḍĕ miyyam̐gām̐ gādanenā
duppaḍigŏṁgu vaṭṭidi tŏludam̐ dā rānaṁdugu
kŏppuvaṭṭi tīsi nenu kobagiṁchavaladā
(||||)
senalugām̐ briyamulu sĕppaguṁḍide nemi
tĕnemovichchide sammadiṁchananenā
tāne śhrīveṁkaḍeśhum̐ḍu tagili nem̐ gūḍidenu
pūni yalasinaṁdugu podiseyavaladā