అందుకు నే మోపము ఆపె నడుగుమనవే
(॥పల్లవి॥)
అందుకు నే మోపము ఆపె నడుగుమనవే
సందడించి ఇందుకుఁగా చలమేఁటికనవే
(॥అందు॥)
వుప్పటించవలదు వూడిగపువారి నింత
చెప్పినటెల్లాఁ దనకు సేయమానేము
కుప్పంచి మమ్ము నిట్టె కొంగువట్టి తియ్యఁగాను
ఇప్పుడు మాయేలికెసా నేమైనననదా
(॥అందు॥)
సిగ్గువాపవలదు చెలికత్తెలము నేము
వొగ్గుచు నేపొద్దు వొద్దనుండేవారము
అగ్గలపుసరసా లట్టెమాతో నాడఁగాను
నిగ్గుల మమ్మంపినాపె నేరములు వేయదా
(॥అందు॥)
ఇంతసేయవలదు ఇద్దరి వారము నేము
వింతలేక తమకెల్ల విశ్వాసులము
బంతి శ్రీవేంకటేశుఁడు పైకొని నన్నుఁ గూడఁగా
యింతకుఁ గర్తయినాపె యెగసక్కే లాడదా
(||pallavi||)
aṁdugu ne mobamu ābĕ naḍugumanave
saṁdaḍiṁchi iṁdugum̐gā salamem̐ṭiganave
(||aṁdu||)
vuppaḍiṁchavaladu vūḍigabuvāri niṁta
sĕppinaḍĕllām̐ danagu seyamānemu
kuppaṁchi mammu niṭṭĕ kŏṁguvaṭṭi tiyyam̐gānu
ippuḍu māyeligĕsā nemainananadā
(||aṁdu||)
sigguvābavaladu sĕligattĕlamu nemu
vŏggusu nebŏddu vŏddanuṁḍevāramu
aggalabusarasā laṭṭĕmādo nāḍam̐gānu
niggula mammaṁpinābĕ neramulu veyadā
(||aṁdu||)
iṁtaseyavaladu iddari vāramu nemu
viṁtalega tamagĕlla viśhvāsulamu
baṁti śhrīveṁkaḍeśhum̐ḍu paigŏni nannum̐ gūḍam̐gā
yiṁtagum̐ gardayinābĕ yĕgasakke lāḍadā