అందుకేమి నీతో నే మాడుకోము
(॥పల్లవి॥)
అందుకేమి నీతో నే మాడుకోము
చందముగాఁ బెనఁగితే సమ్మతించఁజేతుము
(॥అందు॥)
పంతమెల్ల నీడేరె నీ పడఁతికి
కాంతుఁడవు నీ కరుణ గలుగఁగాను
వంతులేల పెట్టేవు మావారి సంది నీ
వింత మన్నించితే నే మెంతకైనా గలము
(॥అందు॥)
చలమెల్లఁ జెల్లెను యీసతికి నేఁడు
బలువుఁడ విట్టె చేపట్టఁగాను
పిలువకు మిద్దరిని పేరువేర
వలచితే వలపులు వడ్డికిఁ బారింతుము
(॥అందు॥)
దొరతనమెల్ల వచ్చె దొయ్యలికి
సరుసఁ బెట్టుక నీవు చనవియ్యఁగా
యిరవై శ్రీ వేంకటేశ యిటు నన్నుఁ గూడితివి
నిరతి నీవుండితేను నిన్నే మెప్పింతుము
(||pallavi||)
aṁdugemi nīdo ne māḍugomu
saṁdamugām̐ bĕnam̐gide sammadiṁcham̐jedumu
(||aṁdu||)
paṁtamĕlla nīḍerĕ nī paḍam̐tigi
kāṁtum̐ḍavu nī karuṇa galugam̐gānu
vaṁtulela pĕṭṭevu māvāri saṁdi nī
viṁta manniṁchide ne mĕṁtagainā galamu
(||aṁdu||)
salamĕllam̐ jĕllĕnu yīsadigi nem̐ḍu
baluvum̐ḍa viṭṭĕ sebaṭṭam̐gānu
piluvagu middarini peruvera
valaside valabulu vaḍḍigim̐ bāriṁtumu
(||aṁdu||)
dŏradanamĕlla vachchĕ dŏyyaligi
sarusam̐ bĕṭṭuga nīvu sanaviyyam̐gā
yiravai śhrī veṁkaḍeśha yiḍu nannum̐ gūḍidivi
niradi nīvuṁḍidenu ninne mĕppiṁtumu