Amdugemi dosamaa ne mamtesi kobamugaaga

అందుకేమి దోసమా నే మంతేసి కోపముగాక
Language

(॥పల్లవి॥)
అందుకేమి దోసమా నే మంతేసి కోపముగాక
నిందవేసుకోనేల నిన్నుఁ జూడరాదా

(॥అందు॥)
చిక్కనినవ్వులు నవ్వి చెక్కులెల్లాఁ జెమరించె
చక్కనివాఁడ వౌదువు చాలించరాదా
మొక్కలపుమాట లాడి మోవియెల్లాఁ బొక్కెనిదె
మిక్కిలిజాణ వౌదువు మేర నుండరాదా

(॥అందు॥)
తేరకొన నన్నుఁ జూచి దేహమెల్లాఁ బులకించె
తారుకాణలాయ నిఁకఁ దలఁగరాదా
గారవించఁ జెయివేసి కరఁగె నీచిత్తమెల్లా
తేరెఁదేరె నీమోహము తెలుసుకోరాదా

(॥అందు॥)
పానుపు మీఁదికి వచ్చి పక్కన నీకొప్పు వీడె
మాన వింకాఁ బంతములు మన్నించరాదా
కోనేటి శ్రీవేంకటేశ కూడితివి నన్ను నిట్టె
మానరాని పొందులాయ మమ్ము మెచ్చరాదా

(||pallavi||)
aṁdugemi dosamā ne maṁtesi kobamugāga
niṁdavesugonela ninnum̐ jūḍarādā

(||aṁdu||)
sikkaninavvulu navvi sĕkkulĕllām̐ jĕmariṁchĕ
sakkanivām̐ḍa vauduvu sāliṁcharādā
mŏkkalabumāḍa lāḍi moviyĕllām̐ bŏkkĕnidĕ
mikkilijāṇa vauduvu mera nuṁḍarādā

(||aṁdu||)
teragŏna nannum̐ jūsi dehamĕllām̐ bulagiṁchĕ
tārugāṇalāya nim̐kam̐ dalam̐garādā
gāraviṁcham̐ jĕyivesi karam̐gĕ nīsittamĕllā
terĕm̐derĕ nīmohamu tĕlusugorādā

(||aṁdu||)
pānubu mīm̐digi vachchi pakkana nīgŏppu vīḍĕ
māna viṁkām̐ baṁtamulu manniṁcharādā
koneḍi śhrīveṁkaḍeśha kūḍidivi nannu niṭṭĕ
mānarāni pŏṁdulāya mammu mĕchcharādā