అందుకేమి దోసమా అతనికి నీకు వేరా
(॥పల్లవి॥)
అందుకేమి దోసమా అతనికి నీకు వేరా
సందడి నాతని రతి సమ్మతించవే
(॥అందు॥)
మోహముగలుగువారు ముందువెనక లెంచరు
యీహల మొక్కెనంటా నీవేల లోఁగేవే
సాహసములూఁ జేతురు చనవులూఁ జెల్లింతురు
పోహణించి వలపుల భోగించవే
(॥అందు॥)
తమిగలిగినవారు దండనుండి పాయరు
కొమరెనంటానేల కొంకఁజూచేవే
జమళిఁ జొక్కుదురు ఇచ్చల నవ్వుదురు తాము
చెమట చిత్తడి తోడ చెలరేఁగవే
(॥అందు॥)
ఆయమెరిఁగినవారు అట్టె కాఁగిలింతురు
చేయివట్టెనంటానేల సిగ్గువడేవే
యీయెడ శ్రీవేంకటేశుఁ డిదె నిన్నుఁ గూడె నేఁడు
చాయలు సేసుక ఇట్టె చనవియ్యవే
(||pallavi||)
aṁdugemi dosamā adanigi nīgu verā
saṁdaḍi nādani radi sammadiṁchave
(||aṁdu||)
mohamugaluguvāru muṁduvĕnaga lĕṁcharu
yīhala mŏkkĕnaṁṭā nīvela lom̐geve
sāhasamulūm̐ jeduru sanavulūm̐ jĕlliṁturu
pohaṇiṁchi valabula bhogiṁchave
(||aṁdu||)
tamigaliginavāru daṁḍanuṁḍi pāyaru
kŏmarĕnaṁṭānela kŏṁkam̐jūseve
jamaḽim̐ jŏkkuduru ichchala navvuduru tāmu
sĕmaḍa sittaḍi toḍa sĕlarem̐gave
(||aṁdu||)
āyamĕrim̐ginavāru aṭṭĕ kām̐giliṁturu
seyivaṭṭĕnaṁṭānela sigguvaḍeve
yīyĕḍa śhrīveṁkaḍeśhum̐ ḍidĕ ninnum̐ gūḍĕ nem̐ḍu
sāyalu sesuga iṭṭĕ sanaviyyave