Amdugemi dosamaa adanido nitlanare

అందుకేమి దోసమా అతనితో నిట్లనరే
Language

(॥పల్లవి॥)
అందుకేమి దోసమా అతనితో నిట్లనరే
పొఁ(పొం?)దైన నాతోడ బొంకవద్దుగాక

(॥అందు॥)
పిలచితే దోసమా ప్రియముతో నోరార
వలవంతఁ గేఁకరించవద్దుగాక
నిలిచితే దోసమా నివ్వెరగుతో నెదుట
నలువంకఁ జెలులతో నవ్వవద్దగాక

(॥అందు॥)
పూఁకొంటే దోసమా వొంటి సుద్దులు చెప్పఁగా
వాఁకపుగోళ్లు చిమ్మవద్దుగాక
వీఁకఁ బట్టితే దోసమా వేడుకఁ బొందైనవారు
సొఁకుచు కెఁగండ్లఁ బారఁజూడవద్దుగాక

(॥అందు॥)
కూడితేనే దోసమా గుట్టుతో దంపతులకు
వాడికసిగ్గులు వడవద్దుగాక
యీడనే శ్రీవేంకటేశుఁడింతలోనె నన్నుఁ గూడె
యేడనైన మోవిచూపేయెమ్మె వద్దుగాక

(||pallavi||)
aṁdugemi dosamā adanido niṭlanare
pŏm̐(pŏṁ?)daina nādoḍa bŏṁkavaddugāga

(||aṁdu||)
pilaside dosamā priyamudo norāra
valavaṁtam̐ gem̐kariṁchavaddugāga
niliside dosamā nivvĕragudo nĕduḍa
naluvaṁkam̐ jĕlulado navvavaddagāga

(||aṁdu||)
pūm̐kŏṁṭe dosamā vŏṁṭi suddulu sĕppam̐gā
vām̐kabugoḽlu simmavaddugāga
vīm̐kam̐ baṭṭide dosamā veḍugam̐ bŏṁdainavāru
sŏm̐kusu kĕm̐gaṁḍlam̐ bāram̐jūḍavaddugāga

(||aṁdu||)
kūḍidene dosamā guṭṭudo daṁpadulagu
vāḍigasiggulu vaḍavaddugāga
yīḍane śhrīveṁkaḍeśhum̐ḍiṁtalonĕ nannum̐ gūḍĕ
yeḍanaina movisūbeyĕmmĕ vaddugāga