అందుకేమే యెడమాటలాడితేనే దోసమా
(॥పల్లవి॥)
అందుకేమే యెడమాటలాడితేనే దోసమా
అంది నేను మొక్కినందు కటు చూడఁదగదా
(॥అందు॥)
చేరి తనపంతమే చెల్లితేఁ జాలుఁగాక
నారుకోన వెనకనే నవ్వఁదడవా
నేరమి నాదేకాక నెట్టనఁ దా నేమిసేసు
అరీతి నే వలవఁ దా నంతి సేయఁదగవా
(॥అందు॥)
నటనల యెమ్మెలఁదా నడచితేఁ జాలుఁగాక
చిటుకన గోర నేఁ జిమ్మఁ దడవా
సటకాఁడు దనకేమి సాదుగొల నేనేకాక
తటుకన నేరాఁగాఁ దలవంచఁ దగదా
(॥అందు॥)
మిక్కిలి రతులఁ దానే మీఁదై తేఁ జాలుఁగాక
చొక్కించి తనవెము చూడఁదడనా
చక్కనిశ్రీవేంకటేశ్వరుఁడే తానన్నుఁ గూడె
తక్కక యిన్నిటికి నేఁ దన్ను మెచ్చఁదగదా
(||pallavi||)
aṁdugeme yĕḍamāḍalāḍidene dosamā
aṁdi nenu mŏkkinaṁdu kaḍu sūḍam̐dagadā
(||aṁdu||)
seri tanabaṁtame sĕllidem̐ jālum̐gāga
nārugona vĕnagane navvam̐daḍavā
nerami nādegāga nĕṭṭanam̐ dā nemisesu
arīdi ne valavam̐ dā naṁti seyam̐dagavā
(||aṁdu||)
naḍanala yĕmmĕlam̐dā naḍasidem̐ jālum̐gāga
siḍugana gora nem̐ jimmam̐ daḍavā
saḍagām̐ḍu danagemi sādugŏla nenegāga
taḍugana nerām̐gām̐ dalavaṁcham̐ dagadā
(||aṁdu||)
mikkili radulam̐ dāne mīm̐dai tem̐ jālum̐gāga
sŏkkiṁchi tanavĕmu sūḍam̐daḍanā
sakkaniśhrīveṁkaḍeśhvarum̐ḍe tānannum̐ gūḍĕ
takkaga yinniḍigi nem̐ dannu mĕchcham̐dagadā