Amduge visaarimche nappadanumdi

అందుకే విచారించే నప్పటనుండి
Language

(॥పల్లవి॥)
అందుకే విచారించే నప్పటనుండి
చెంది నాకు నొక్క బుద్ది చెప్పవే చెలియా

(॥అందు॥)
సొలసి యాతని నేఁచూచితేను నా చూపులు
కొలఁది మీరఁగ నాఁటుకొనవుగదా
కొలువు నేఁ జేసితేను కోరి నా చక్కఁదనము
తలఁపులోఁ జుట్టుకొని తమి రేఁచదుగదా

(॥అందు॥)
తగిలి మాఁటాడితేను తతి మోవితెనె గారి
సొగటువారి యతఁడు చొక్కఁడుగదా
నగితేను ముంచుకొని నాతోడి సంగాతము
జిగురువలె నంటుక చిక్కించుకోదుగదా

(॥అందు॥)
కదిసి కాఁగిలించితే గట్టి నా చన్నులు దాఁకి
పదరి మదనకళ పట్టదుగదా
ఇదివో శ్రీవేంకటేశుఁ డేలె నన్నుఁ దానె వచ్చి
పొదిగితే మేనెల్లాఁ బులకించదుగదా

(||pallavi||)
aṁduge visāriṁche nappaḍanuṁḍi
sĕṁdi nāgu nŏkka buddi sĕppave sĕliyā

(||aṁdu||)
sŏlasi yādani nem̐sūsidenu nā sūbulu
kŏlam̐di mīram̐ga nām̐ṭugŏnavugadā
kŏluvu nem̐ jesidenu kori nā sakkam̐danamu
talam̐pulom̐ juṭṭugŏni tami rem̐sadugadā

(||aṁdu||)
tagili mām̐ṭāḍidenu tadi movidĕnĕ gāri
sŏgaḍuvāri yadam̐ḍu sŏkkam̐ḍugadā
nagidenu muṁchugŏni nādoḍi saṁgādamu
jiguruvalĕ naṁṭuga sikkiṁchugodugadā

(||aṁdu||)
kadisi kām̐giliṁchide gaṭṭi nā sannulu dām̐ki
padari madanagaḽa paṭṭadugadā
idivo śhrīveṁkaḍeśhum̐ ḍelĕ nannum̐ dānĕ vachchi
pŏdigide menĕllām̐ bulagiṁchadugadā