Amduge veragayyee nappadanumdeem joosi

అందుకే వెరగయ్యీ నప్పటనుండీఁ జూచి
Language

(॥పల్లవి॥)
అందుకే వెరగయ్యీ నప్పటనుండీఁ జూచి
ఆ(అం?)దముగ నేనే నీకు నాలనై వుందానను

(॥అందు॥)
చెక్కునొక్కి సతి నిన్నుఁ జనకియుఁ దనివొదు
తక్కక సేవలు సేసి తనివోదు
యిక్కువలంటి మోహ మెఱిఁగించి తనివొదు
ఇక్కడ దీనిబత్తి యింకా నెంతగలదో

(॥అందు॥)
చెలరేఁగి విన్నపాలు సేసియునుఁ దనవోదు
తలఁచి నిన్నుఁ బొగడి తనివోదు
వెలయ నీసుద్దులు వినివిని తనివోదు
యెలమి నీపై బత్తియింకా నెంతగలదో

(॥అందు॥)
పచ్చిగాఁగ నిన్ను గుబ్బలనొత్తి తనివొదు
తచ్చితచ్చి కాఁగిలించి తనివోదు
యిచ్చట శ్రీవేంకటేశ యిటు నన్ను నేలితివి
హెచ్చినతనబత్తి యింకా నెంతగలదొ

(||pallavi||)
aṁduge vĕragayyī nappaḍanuṁḍīm̐ jūsi
ā(aṁ?)damuga nene nīgu nālanai vuṁdānanu

(||aṁdu||)
sĕkkunŏkki sadi ninnum̐ janagiyum̐ danivŏdu
takkaga sevalu sesi tanivodu
yikkuvalaṁṭi moha mĕṟim̐giṁchi tanivŏdu
ikkaḍa dīnibatti yiṁkā nĕṁtagalado

(||aṁdu||)
sĕlarem̐gi vinnabālu sesiyunum̐ danavodu
talam̐si ninnum̐ bŏgaḍi tanivodu
vĕlaya nīsuddulu vinivini tanivodu
yĕlami nībai battiyiṁkā nĕṁtagalado

(||aṁdu||)
pachchigām̐ga ninnu gubbalanŏtti tanivŏdu
tachchidachchi kām̐giliṁchi tanivodu
yichchaḍa śhrīveṁkaḍeśha yiḍu nannu nelidivi
hĕchchinadanabatti yiṁkā nĕṁtagaladŏ