Amduge veragayyee naa kappadanumdi

అందుకే వెరగయ్యీ నా కప్పటనుండి
Language

(॥పల్లవి॥)
అందుకే వెరగయ్యీ నా కప్పటనుండి
సందడి వలపు నాపైఁ జల్లితి వదేమయ్యా

(॥అందు॥)
సేయఁగల వూడిగాలు సేసి ని న్నాపె మెప్పించె
రేయిఁ బగలునుఁ దమిరేఁచె నీకును
మాయదారి చేఁతల నీ మనసెల్లాఁ గరఁగించె
యీయెడ మా యింటికి నేఁ డెట్టు వచ్చితివయ్యా

(॥అందు॥)
ఆడఁగల మాఁటలెల్లా నాడి నిన్నుఁ జొక్కించె
వాడికలెల్లాఁ జేసి వలపించెను
వేడుకలు నీకుఁ జూపి వినోదాలు మరిగించె
యీడ మాతో సరసము లెంతేశాడేవయ్యా

(॥అందు॥)
నవ్వగలట్టల్లా నవ్వి నంటున నిన్నుఁ దేలించె
చివ్వనఁ బెనఁగి సంతోసింపించెను
రవ్వగా శ్రీవేంకటేశ రతి నన్ను నేలితిని
ఇవ్వల నెన్ని చనవు లిచ్చి మన్నించేవయ్యా

(||pallavi||)
aṁduge vĕragayyī nā kappaḍanuṁḍi
saṁdaḍi valabu nābaim̐ jallidi vademayyā

(||aṁdu||)
seyam̐gala vūḍigālu sesi ni nnābĕ mĕppiṁchĕ
reyim̐ bagalunum̐ damirem̐sĕ nīgunu
māyadāri sem̐tala nī manasĕllām̐ garam̐giṁchĕ
yīyĕḍa mā yiṁṭigi nem̐ ḍĕṭṭu vachchidivayyā

(||aṁdu||)
āḍam̐gala mām̐ṭalĕllā nāḍi ninnum̐ jŏkkiṁchĕ
vāḍigalĕllām̐ jesi valabiṁchĕnu
veḍugalu nīgum̐ jūbi vinodālu marigiṁchĕ
yīḍa mādo sarasamu lĕṁteśhāḍevayyā

(||aṁdu||)
navvagalaṭṭallā navvi naṁṭuna ninnum̐ deliṁchĕ
sivvanam̐ bĕnam̐gi saṁtosiṁpiṁchĕnu
ravvagā śhrīveṁkaḍeśha radi nannu nelidini
ivvala nĕnni sanavu lichchi manniṁchevayyā