Amduge veragayyee naa kappadanumdi

అందుకే వెరగయ్యీ నా కప్పటనుండి
Language

(॥పల్లవి॥)
అందుకే వెరగయ్యీ నా కప్పటనుండి
కందువలెల్లా నెట్టు గడియించుకొంటివే

(॥అందు॥)
సెలవి నవ్వులలోని చిరుసిగ్గులు
పలుకులలోపలి పచ్చి తేనెలు
తళుకు గన్నుచూపుల తరితీపులు
కలికితనా లెన్ని గడియించుకొంటివే

(॥అందు॥)
మొనసి చెలులతోడి ముసగసలు
చెనకుల కొనగోరి చిట్టంటులు
పెనఁగేటి సరసపు పెడరేఁపులు
గనమాయ నెందుండి గడియించుకొంటివే

(॥అందు॥)
సారె బొమ్మ జంకెనల సాదింపులు
యీరీతి నీకేలే యెలయింపులు
కోరి శ్రీవేంకటేశుఁడు గూడెను నన్ను
కారనాలు నీ వెందు గడియించుకొంటివే

(||pallavi||)
aṁduge vĕragayyī nā kappaḍanuṁḍi
kaṁduvalĕllā nĕṭṭu gaḍiyiṁchugŏṁṭive

(||aṁdu||)
sĕlavi navvulaloni sirusiggulu
palugulalobali pachchi tenĕlu
taḽugu gannusūbula taridībulu
kaligidanā lĕnni gaḍiyiṁchugŏṁṭive

(||aṁdu||)
mŏnasi sĕluladoḍi musagasalu
sĕnagula kŏnagori siṭṭaṁṭulu
pĕnam̐geḍi sarasabu pĕḍarem̐pulu
ganamāya nĕṁduṁḍi gaḍiyiṁchugŏṁṭive

(||aṁdu||)
sārĕ bŏmma jaṁkĕnala sādiṁpulu
yīrīdi nīgele yĕlayiṁpulu
kori śhrīveṁkaḍeśhum̐ḍu gūḍĕnu nannu
kāranālu nī vĕṁdu gaḍiyiṁchugŏṁṭive