అందుకే తల్లడిమందీ నంతరంగము
(॥పల్లవి॥)
అందుకే తల్లడిమందీ నంతరంగము
వొందిలినే పవ్వళించివున్నాడు లోనను
(॥అందు॥)
పెనఁగ నే నోపనంటి బిగిసినదానఁగాను
మనసున నెట్టుండెనొ మగనికిని
వినయాన మీరైనా విన్నవించరే చెలులు
వొనరఁగఁ జిన్నఁ బోయివున్నాఁడు లోనను
(॥అందు॥)
అట్టెరా సిగ్గువతితి నలిగినదానఁగాను
యెట్టని యాడుకొనునో ఇందరితోను
గుట్టుతో నీతని వేఁడుకొని సారెకు మొక్కరే
వొట్టుకొన్నచింతతోడ నున్నాఁడు లోనను
(॥అందు॥)
సరిఁ గాఁగిటఁ గూడితి చలపాదిదానఁగాను
ఇరవై శ్రీవేంకటేశు కెద్ది ప్రియమో
పరగఁ దనకు నిట్టె పంతమీయరే మీరు
వొరసి తా నవ్వుకొంటా నున్నాఁడు లోనను
(||pallavi||)
aṁduge tallaḍimaṁdī naṁtaraṁgamu
vŏṁdiline pavvaḽiṁchivunnāḍu lonanu
(||aṁdu||)
pĕnam̐ga ne nobanaṁṭi bigisinadānam̐gānu
manasuna nĕṭṭuṁḍĕnŏ maganigini
vinayāna mīrainā vinnaviṁchare sĕlulu
vŏnaram̐gam̐ jinnam̐ boyivunnām̐ḍu lonanu
(||aṁdu||)
aṭṭĕrā sigguvadidi naliginadānam̐gānu
yĕṭṭani yāḍugŏnuno iṁdaridonu
guṭṭudo nīdani vem̐ḍugŏni sārĕgu mŏkkare
vŏṭṭugŏnnasiṁtadoḍa nunnām̐ḍu lonanu
(||aṁdu||)
sarim̐ gām̐giḍam̐ gūḍidi salabādidānam̐gānu
iravai śhrīveṁkaḍeśhu kĕddi priyamo
paragam̐ danagu niṭṭĕ paṁtamīyare mīru
vŏrasi tā navvugŏṁṭā nunnām̐ḍu lonanu