అందు కేమిదోసము ఆనతియ్యఁ గదవయ్య
(॥పల్లవి॥)
అందు కేమిదోసము ఆనతియ్యఁ గదవయ్య
యిందరి నీవేలేది యెఱఁగమా యెపుడు
(॥అందు॥)
బోన మాయితము సేసి పొలిఁతి విలువఁగాను
ఆనాతినే విడె మడిగేవు
పూని యేడనైనా నీవు బోజనము సేసితివో
యేనెలఁతవిఁ(విం?) దైవా నియ్యకొంటివో
(॥అందు॥)
కంచముపట్టుసేసి కాంత గూచుండు మనఁగా
మంచినీళ్లిమ్మనేవు మఱి నాపెనే
అంచెలఁ బిండిపంటలే యారగించి వచ్చితివో
పొంచి యెవ్వతైనా వొక్కపొద్దు చెప్పెనో
(॥అందు॥)
కలవెల్లా వడ్డించి కడి యెత్తు మనఁగాను
అలమి మోవితేనియ లడిగేవు
యెలమి శ్రీవేంకటేశ యేకారము నంజితివో
నెలవై నన్నుఁ గూడితి నీకు నిదేప్రియమో
(||pallavi||)
aṁdu kemidosamu ānadiyyam̐ gadavayya
yiṁdari nīveledi yĕṟam̐gamā yĕbuḍu
(||aṁdu||)
bona māyidamu sesi pŏlim̐ti viluvam̐gānu
ānādine viḍĕ maḍigevu
pūni yeḍanainā nīvu bojanamu sesidivo
yenĕlam̐tavim̐(viṁ?) daivā niyyagŏṁṭivo
(||aṁdu||)
kaṁchamubaṭṭusesi kāṁta gūsuṁḍu manam̐gā
maṁchinīḽlimmanevu maṟi nābĕne
aṁchĕlam̐ biṁḍibaṁṭale yāragiṁchi vachchidivo
pŏṁchi yĕvvadainā vŏkkabŏddu sĕppĕno
(||aṁdu||)
kalavĕllā vaḍḍiṁchi kaḍi yĕttu manam̐gānu
alami movideniya laḍigevu
yĕlami śhrīveṁkaḍeśha yegāramu naṁjidivo
nĕlavai nannum̐ gūḍidi nīgu nidepriyamo