అందు కంటినటే నీ యందము లెంచితిఁ గాక
(॥పల్లవి॥)
అందు కంటినటే నీ యందము లెంచితిఁ గాక
చిందేటి నా మోహము నీచేతఁ జిక్కెఁ గదరా
(॥అందు॥)
నడుము పిడికెఁడంత నాతి నీకుచములైతే
బడి నొకటే పట్టెఁడంత
యెడ నాయంగము లివి యెంతలెంతలైనాను
చిడుముడి నిన్నయు నీచేతిలోనేకదరా
(॥అందు॥)
మొగము గొడిఁదెఁడంత మోహనపుఁగనుదోయి
చిగురుఁబో డిదియేమే చేరఁడంత
యెగసక్కె మిఁకనేల యేర నే నెట్టుంటినాను
జిగి నాసింగారము నీచేతిలోనేకదరా
(॥అందు॥)
సుదతి నీయడుగులు జుట్టెఁడంత, దేహమైతే
సదరమైనయేడు జానలంత
కదిసితి విదె శ్రీవేంకటపతి విటు నన్ను
చెదరని నేను నీచేతిలోనే కదరా
(||pallavi||)
aṁdu kaṁṭinaḍe nī yaṁdamu lĕṁchidim̐ gāga
siṁdeḍi nā mohamu nīsedam̐ jikkĕm̐ gadarā
(||aṁdu||)
naḍumu piḍigĕm̐ḍaṁta nādi nīgusamulaide
baḍi nŏgaḍe paṭṭĕm̐ḍaṁta
yĕḍa nāyaṁgamu livi yĕṁtalĕṁtalainānu
siḍumuḍi ninnayu nīsedilonegadarā
(||aṁdu||)
mŏgamu gŏḍim̐dĕm̐ḍaṁta mohanabum̐ganudoyi
sigurum̐bo ḍidiyeme seram̐ḍaṁta
yĕgasakkĕ mim̐kanela yera ne nĕṭṭuṁṭinānu
jigi nāsiṁgāramu nīsedilonegadarā
(||aṁdu||)
sudadi nīyaḍugulu juṭṭĕm̐ḍaṁta, dehamaide
sadaramainayeḍu jānalaṁta
kadisidi vidĕ śhrīveṁkaḍabadi viḍu nannu
sĕdarani nenu nīsedilone kadarā