Amdarunu vinaramma aamaamta

అందరును వినరమ్మ ఆమాఁట
Language

(॥పల్లవి॥)
అందరును వినరమ్మ ఆమాఁట
ఆందాలు చెప్పఁగవచ్చీ నమ్మరోయమ్మా

(॥అంద॥)
యీతల నన్ను రమ్మని యేఁటికి బిలిపించెనో
ఆతని నడుగరమ్మా ఆమాఁట
రాతిరెల్లా జాగరాలే రవ్వ కెక్కెఁ బగలెల్లా
చేఁతలేమి సేయవలెఁ జెప్పరోయమ్మా

(॥అంద॥)
పనిలేనిపని కేల పంతమిచ్చెనో కాని
అనఁడా తా నావేళ ఆమాఁట
తనిసె నామనసెల్లాఁ దలకెక్కె వలపెల్లా
ఆనుమానా లేమిగల్లా నాడుమనరమ్మా

(॥అంద॥)
యేకతానఁ జెప్పేనంటా నిందరి మిమ్ముఁ బొమ్మనె
అకడ నప్పుడే వింటి నామాఁట
పైకొని శ్రీవేంకటాద్రిపతి యింతసేసి కూడె
మీకుమీకే యిఁకనైనా మెచ్చుకోరేయమ్మా

(||pallavi||)
aṁdarunu vinaramma āmām̐ṭa
āṁdālu sĕppam̐gavachchī nammaroyammā

(||aṁda||)
yīdala nannu rammani yem̐ṭigi bilibiṁchĕno
ādani naḍugarammā āmām̐ṭa
rādirĕllā jāgarāle ravva kĕkkĕm̐ bagalĕllā
sem̐talemi seyavalĕm̐ jĕpparoyammā

(||aṁda||)
panilenibani kela paṁtamichchĕno kāni
anam̐ḍā tā nāveḽa āmām̐ṭa
tanisĕ nāmanasĕllām̐ dalagĕkkĕ valabĕllā
ānumānā lemigallā nāḍumanarammā

(||aṁda||)
yegadānam̐ jĕppenaṁṭā niṁdari mimmum̐ bŏmmanĕ
agaḍa nappuḍe viṁṭi nāmām̐ṭa
paigŏni śhrīveṁkaḍādribadi yiṁtasesi kūḍĕ
mīgumīge yim̐kanainā mĕchchugoreyammā