Amdarunu suttaale amdarunu bamdugule

అందరును చుట్టాలే అందరును బందుగులే
Language

(॥పల్లవి॥)
అందరును చుట్టాలే అందరును బందుగులే
సందడి మీతో నేను జగడించేనా

(॥అంద॥)
వరుస రాజుమన్నించేవారే దేవుళ్లుగాక
యెరవులవా రిందుకేల వచ్చేరే
నిరతి నాతఁడుండఁగ నేఁడు మీ రేమి సేతురే
గొరబుసేసి మిమ్మిఁక కోపగించేనా

(॥అంద॥)
బలువుఁడు కసవుచేపట్టిన మేరువేకాక
నెలకొన్నసతులకు నేరమేడదే
కలవాఁ డాతఁడే కాక కారణము మీరయ్యేరా
పిలిచి మీతో నేను బీరమాడేనా

(॥అంద॥)
పక్కనను వెదుళ్లపందిలే చక్కనగాక
యెక్కువ తక్కువలు మీ కేడనున్నవే
యిక్కువతో శ్రీ వేంకటేశుఁడిదె నన్నుఁ గూడె
వొక్కటైతి మీతో నిఁక నొరటులాడేనా

(||pallavi||)
aṁdarunu suṭṭāle aṁdarunu baṁdugule
saṁdaḍi mīdo nenu jagaḍiṁchenā

(||aṁda||)
varusa rājumanniṁchevāre devuḽlugāga
yĕravulavā riṁdugela vachchere
niradi nādam̐ḍuṁḍam̐ga nem̐ḍu mī remi sedure
gŏrabusesi mimmim̐ka kobagiṁchenā

(||aṁda||)
baluvum̐ḍu kasavusebaṭṭina meruvegāga
nĕlagŏnnasadulagu nerameḍade
kalavām̐ ḍādam̐ḍe kāga kāraṇamu mīrayyerā
pilisi mīdo nenu bīramāḍenā

(||aṁda||)
pakkananu vĕduḽlabaṁdile sakkanagāga
yĕkkuva takkuvalu mī keḍanunnave
yikkuvado śhrī veṁkaḍeśhum̐ḍidĕ nannum̐ gūḍĕ
vŏkkaḍaidi mīdo nim̐ka nŏraḍulāḍenā