అందరు నొక్కసరిగా నాడకు నీవు
(॥పల్లవి॥)
అందరు నొక్కసరిగా నాడకు నీవు
మందలించి మమ్ము నిట్టె మన్నింతువు గాని
(॥అంద॥)
ప్రియ మెరిఁగినకాంత బిగియదు పిలిచితే
నయగారి దెప్పుడు నానలు వెట్టదు
నియతిగలిగినది నేరము లేమీ నెంచదు
క్రియ దెలిసినదెందూ గినుకనుఁ జొరదు
(॥అంద॥)
గుట్టుతోడిదైతేను కూరిములు గొసరదు
చుట్టరికమైనది యీసులు రేఁచదు
నెట్టన వలఁచినది నిందలు పైవేయదు
దిట్టయైనది గక్కనఁ దెగువలు చూపదు
(॥అంద॥)
ఇచ్చకమై యుండేది యెరవులు సేయదు
వొచ్చములేనిది తగవులఁ బెట్టదు
యిచ్చట శ్రీ వేంకటశ యేలితివి నన్ను నేఁడు
మచ్చిక సేసినది వేమరు కెదురాడదు
(||pallavi||)
aṁdaru nŏkkasarigā nāḍagu nīvu
maṁdaliṁchi mammu niṭṭĕ manniṁtuvu gāni
(||aṁda||)
priya mĕrim̐ginagāṁta bigiyadu piliside
nayagāri dĕppuḍu nānalu vĕṭṭadu
niyadigaliginadi neramu lemī nĕṁchadu
kriya dĕlisinadĕṁdū ginuganum̐ jŏradu
(||aṁda||)
guṭṭudoḍidaidenu kūrimulu gŏsaradu
suṭṭarigamainadi yīsulu rem̐sadu
nĕṭṭana valam̐sinadi niṁdalu paiveyadu
diṭṭayainadi gakkanam̐ dĕguvalu sūbadu
(||aṁda||)
ichchagamai yuṁḍedi yĕravulu seyadu
vŏchchamulenidi tagavulam̐ bĕṭṭadu
yichchaḍa śhrī veṁkaḍaśha yelidivi nannu nem̐ḍu
machchiga sesinadi vemaru kĕdurāḍadu