అందరిముందరా నింత ఆగడాలు సేతురా
(॥పల్లవి॥)
అందరిముందరా నింత ఆగడాలు సేతురా
విందువంటి నీ రాకకు వేసరుకొనేనా
(॥అంద॥)
పెనఁగ నీతో నంత పెద్దరికమా నాకు
చెనకితే చెలులకు సిగ్గులు రావా
పనిమాలినపని బలుములు సేతురా
ఘనుఁడ యేకతమైతేఁ గాదనేనా
(॥అంద॥)
బిగియ నీతో నాకు బిరుదులపంతమా
మగువలు నవ్వితేను మాటకు రారా
తగవెంచి చూచుకోక తమకింతురా నీవు
మొగము చూచితే నీకు మొక్కకుంటీనా
(॥అంద॥)
జంకించ నీయెడకు సారె సారె సూడుఁ బాడా
మంకు గలిగించితే మారుకొనరా
అంకెల శ్రీవేంకటేశ ఆయమంటి కూడితివి
సుంకులనీరతులకు చొక్కకుంటినా
(||pallavi||)
aṁdarimuṁdarā niṁta āgaḍālu sedurā
viṁduvaṁṭi nī rāgagu vesarugŏnenā
(||aṁda||)
pĕnam̐ga nīdo naṁta pĕddarigamā nāgu
sĕnagide sĕlulagu siggulu rāvā
panimālinabani balumulu sedurā
ghanum̐ḍa yegadamaidem̐ gādanenā
(||aṁda||)
bigiya nīdo nāgu birudulabaṁtamā
maguvalu navvidenu māḍagu rārā
tagavĕṁchi sūsugoga tamagiṁturā nīvu
mŏgamu sūside nīgu mŏkkaguṁṭīnā
(||aṁda||)
jaṁkiṁcha nīyĕḍagu sārĕ sārĕ sūḍum̐ bāḍā
maṁku galigiṁchide mārugŏnarā
aṁkĕla śhrīveṁkaḍeśha āyamaṁṭi kūḍidivi
suṁkulanīradulagu sŏkkaguṁṭinā