Amdarigim daarugaana laumgadare selulaala

అందరికిఁ దారుకాణ లౌఁగదరె చెలులాల
Language

(॥పల్లవి॥)
అందరికిఁ దారుకాణ లౌఁగదరె చెలులాల
పొందుగా నీరీతుల భోగించుటే నేరుపు

(॥అంద॥)
వినయముతోఁ జెప్పినవిందు కడుఁగడుఁజవి
ననువుతో నవ్విననవ్వుచవి
మనసురా మాటాడిన మంతన మెప్పుడుఁజవి
పనిపూని వలచినపతికి సతికిని

(॥అంద॥)
యితవుతోనాడించేయెడమాటలే ఇంపు
తతి నెదురుచూపుల తమక మింపు
చతురతఁ బెనఁగేటిసరసపుఁ జేఁత లింపు
అతికాంక్ష మెలఁగేటియాలికి మగనికి

(॥అంద॥)
గుట్టుతోడఁ గూరిములు గొసరుటే వేడుక
చుట్టుక రతుల మెప్పించుటే వేడుక
వొట్టుకొన్న కూటముల నుమ్మగిలుటే వేడుక
అట్టె శ్రీవేంకటేశు కలమేలుమంగకూ

(||pallavi||)
aṁdarigim̐ dārugāṇa laum̐gadarĕ sĕlulāla
pŏṁdugā nīrīdula bhogiṁchuḍe nerubu

(||aṁda||)
vinayamudom̐ jĕppinaviṁdu kaḍum̐gaḍum̐javi
nanuvudo navvinanavvusavi
manasurā māḍāḍina maṁtana mĕppuḍum̐javi
panibūni valasinabadigi sadigini

(||aṁda||)
yidavudonāḍiṁcheyĕḍamāḍale iṁpu
tadi nĕdurusūbula tamaga miṁpu
saduradam̐ bĕnam̐geḍisarasabum̐ jem̐ta liṁpu
adigāṁkṣha mĕlam̐geḍiyāligi maganigi

(||aṁda||)
guṭṭudoḍam̐ gūrimulu gŏsaruḍe veḍuga
suṭṭuga radula mĕppiṁchuḍe veḍuga
vŏṭṭugŏnna kūḍamula nummagiluḍe veḍuga
aṭṭĕ śhrīveṁkaḍeśhu kalamelumaṁgagū