Amdarigi nee reede kaa adamadaa lemidigi

అందరికి నీ రీతే కా అటమటా లేమిటికి
Language

(॥పల్లవి॥)
అందరికి నీ రీతే కా అటమటా లేమిటికి
నిందలకుఁ జొర నీదే నేరుపింతేకాక

(॥॥)
పడఁతికి నిన్ననె బాసయిచ్చినవాఁడవు
తడఁబడి యింతలోనే తప్పవచ్చునా
నడుమ నన్నుఁ జూచి నాతో మొగమోటానకు
చిడుముడి నిచ్చకాలు సేసేవుగాక

(॥॥)
ప్రేమముతో నిందాఁకాఁ బిలిపించినవాఁడవు
దోమటిదొడుక కిఁకఁ దోయవచ్చునా
నామనసు గన్నదాఁకా నాటకములు జరపి
గామిడి వేసాలు సేసి కదిసేవుగాక

(॥॥)
అండఁబెట్టు కాపెవిడే లందుకొన్నవాఁడవు
దండిగాఁ గూడ కిఁక దాఁచవచ్చునా
కొండవలె నన్నేలితి కోరి శ్రీవెంకటేశుఁడ
చండిసేసి వినోదాలు జరుపేవుగాక

(||pallavi||)
aṁdarigi nī rīde kā aḍamaḍā lemiḍigi
niṁdalagum̐ jŏra nīde nerubiṁtegāga

(||||)
paḍam̐tigi ninnanĕ bāsayichchinavām̐ḍavu
taḍam̐baḍi yiṁtalone tappavachchunā
naḍuma nannum̐ jūsi nādo mŏgamoḍānagu
siḍumuḍi nichchagālu sesevugāga

(||||)
premamudo niṁdām̐kām̐ bilibiṁchinavām̐ḍavu
domaḍidŏḍuga kim̐kam̐ doyavachchunā
nāmanasu gannadām̐kā nāḍagamulu jarabi
gāmiḍi vesālu sesi kadisevugāga

(||||)
aṁḍam̐bĕṭṭu kābĕviḍe laṁdugŏnnavām̐ḍavu
daṁḍigām̐ gūḍa kim̐ka dām̐savachchunā
kŏṁḍavalĕ nannelidi kori śhrīvĕṁkaḍeśhum̐ḍa
saṁḍisesi vinodālu jarubevugāga