Amdaridodi paadu atte kaaneevayya

అందరితోడి పాటు అట్టే కానీవయ్య
Language

(॥పల్లవి॥)
అందరితోడి పాటు అట్టే కానీవయ్య
సందడించి వేఁడుకోఁగా చలపట్టేనా

(॥అంద॥)
కప్పురాలు మాఁటలు కారాలు చేఁతలు
యెప్పుడు మీ పొందులు సతు లెట్టు సేతురో
తప్పు వట్టరాదు నీకు తమక మెంతైనా గద్దు
నెప్పున నీ యానతి నేఁ గాదనేనా

(॥అందు॥)
నిగరాలు బాసలు నెరుసలు మాయలు
మగువలు నీకే యెట్టు మరుపుదురో
తగవులే నెరపేవు దైవారీ వలపులు
నిగిడి నీ యానతి నేఁ గాదనేనా

(॥అందు॥)
చెలువము మొగము చెనకులు మేనెల్ల
బలిమి నీ యింతు లెట్టు భ్రమఁ జిక్కిరో
కలసితి విటు నన్ను గక్కన శ్రీ వేంకటేశ
నెలవై నీ యానతి నేఁ గాదనేనా

(||pallavi||)
aṁdaridoḍi pāḍu aṭṭe kānīvayya
saṁdaḍiṁchi vem̐ḍugom̐gā salabaṭṭenā

(||aṁda||)
kappurālu mām̐ṭalu kārālu sem̐talu
yĕppuḍu mī pŏṁdulu sadu lĕṭṭu seduro
tappu vaṭṭarādu nīgu tamaga mĕṁtainā gaddu
nĕppuna nī yānadi nem̐ gādanenā

(||aṁdu||)
nigarālu bāsalu nĕrusalu māyalu
maguvalu nīge yĕṭṭu marubuduro
tagavule nĕrabevu daivārī valabulu
nigiḍi nī yānadi nem̐ gādanenā

(||aṁdu||)
sĕluvamu mŏgamu sĕnagulu menĕlla
balimi nī yiṁtu lĕṭṭu bhramam̐ jikkiro
kalasidi viḍu nannu gakkana śhrī veṁkaḍeśha
nĕlavai nī yānadi nem̐ gādanenā