(॥పల్లవి॥)
అందరి నడుగవయ్య అదేమని
సందడి నొకరొకరు సన్నలు సేసేరు
(॥అంద॥)
పలుమారు నీవు నాకు బాసలెల్లాఁ జేయఁగాను
నలువంకల సతులు నవ్వేరు నిన్ను
కలయ నాగుబ్బలపై గందము పూయఁగాదు
చలి వాసి తామేల జాణతనాలాడేరు
(॥అంద॥)
అట్టె నీవు విడెమచ్చి అసలు చూపఁగాను
దిట్టతనముననదె తిట్టేరు నిన్ను
గుట్టున నీవు కొప్పు దువ్వి ముడువఁగా
పొట్టఁ బోరుగున నుండి పొగడ వచ్చేరు
(॥అంద॥)
గక్కన నీవు నన్నుఁ గాఁగిలించుకొనఁగాను
చొక్కుచు సోలుచు వచ్చి చుట్టా ల య్యేరు
చిక్కితివి కడపలో శ్రీవేంకటేశ్వర నాకు
మక్కువతో నీదిక్కు మగిడి చూచేరు
(||pallavi||)
aṁdari naḍugavayya ademani
saṁdaḍi nŏgarŏgaru sannalu seseru
(||aṁda||)
palumāru nīvu nāgu bāsalĕllām̐ jeyam̐gānu
naluvaṁkala sadulu navveru ninnu
kalaya nāgubbalabai gaṁdamu pūyam̐gādu
sali vāsi tāmela jāṇadanālāḍeru
(||aṁda||)
aṭṭĕ nīvu viḍĕmachchi asalu sūbam̐gānu
diṭṭadanamunanadĕ tiṭṭeru ninnu
guṭṭuna nīvu kŏppu duvvi muḍuvam̐gā
pŏṭṭam̐ boruguna nuṁḍi pŏgaḍa vachcheru
(||aṁda||)
gakkana nīvu nannum̐ gām̐giliṁchugŏnam̐gānu
sŏkkusu solusu vachchi suṭṭā la yyeru
sikkidivi kaḍabalo śhrīveṁkaḍeśhvara nāgu
makkuvado nīdikku magiḍi sūseru