Amdaramu namdarame avumgaadanamgalamaa

అందరము నందరమె అవుఁగాదనఁగలమా
Language

(॥పల్లవి॥)
అందరము నందరమె అవుఁగాదనఁగలమా
పొందులు గావించ నేర్చు పుష్పాస్త్రుఁ డొకఁడె

(॥అంద॥)
బలిమికాడవు నీవు పాయపుదాన నేను
మెలుపురాలవంటివి మేఁటి చన్నులు
తలపోయ నిఁక మంచితనము లెట్టబ్బునో
వలరాజొక్కఁడె నేర్చు వైపులుగావింపను

(॥అంద॥)
నాములెక్కు నీ నవ్వులు నాతలము బెట్టదము
గామిడి నా చూపులు కడు గబ్బులు
యేమని పొసఁగించే దెవ్వరించు కోపుదురు
కాముఁడొక్కఁడె నేర్చు కైవసము సేయను

(॥అంద॥)
శ్రీవేంకటపతివి చేకొంటివి నీ దేవిని
హివిరి నావలపిది వలవంటిది
చేవదేరేరతులను చిక్కుదేరే దేగతినో
భావజుఁడొక్కఁడే నేర్చు పంత మీడేరించను

(||pallavi||)
aṁdaramu naṁdaramĕ avum̐gādanam̐galamā
pŏṁdulu gāviṁcha nersu puṣhpāstrum̐ ḍŏgam̐ḍĕ

(||aṁda||)
balimigāḍavu nīvu pāyabudāna nenu
mĕluburālavaṁṭivi mem̐ṭi sannulu
talaboya nim̐ka maṁchidanamu lĕṭṭabbuno
valarājŏkkam̐ḍĕ nersu vaibulugāviṁpanu

(||aṁda||)
nāmulĕkku nī navvulu nādalamu bĕṭṭadamu
gāmiḍi nā sūbulu kaḍu gabbulu
yemani pŏsam̐giṁche dĕvvariṁchu kobuduru
kāmum̐ḍŏkkam̐ḍĕ nersu kaivasamu seyanu

(||aṁda||)
śhrīveṁkaḍabadivi segŏṁṭivi nī devini
hiviri nāvalabidi valavaṁṭidi
sevadereradulanu sikkudere degadino
bhāvajum̐ḍŏkkam̐ḍe nersu paṁta mīḍeriṁchanu