Amdanunna selulamu nannidaam danisidimi

అండనున్న చెలులము నన్నిటాఁ దనిసితిమి
Language

(॥పల్లవి॥)
అండనున్న చెలులము నన్నిటాఁ దనిసితిమి
యెండా నీడాఁ దెలిసితి వేమిసేతువయ్యా

(॥అండ॥)
చెప్పినమాటలెల్లా చెవులొగ్గి వింటివి
రెప్పలెత్తి చూచితివి వొప్పుగొంటివి
దప్పిదేరె నీ యింతి దవ్వుల నీసుద్దులకే
ఇప్పుడింతకంటె నిఁకనేమి సేతువయ్యా

(॥అండ॥)
కరఁగిలి వింపులను కడును లాలించితివి
శిరసూఁచుకొని సన్నసేసితివి
సరసమున నీఇంతి చినవరిమాయను
ఇరవాయ నింతకంటె నేమిసేతువయ్యా

(॥అండ॥)
చేరి కాఁగిలించితివి చెక్కు చేత నొక్కితివి
గారవించి రతులనుఁగైకొంటివి
యీరీతి శ్రీవేంకటేశ యీసతి మన్ననఁ బొందె
యేరవ్వా నే లింతకంటె నేమిసేతువయ్యా

(||pallavi||)
aṁḍanunna sĕlulamu nanniḍām̐ danisidimi
yĕṁḍā nīḍām̐ dĕlisidi vemiseduvayyā

(||aṁḍa||)
sĕppinamāḍalĕllā sĕvulŏggi viṁṭivi
rĕppalĕtti sūsidivi vŏppugŏṁṭivi
dappiderĕ nī yiṁti davvula nīsuddulage
ippuḍiṁtagaṁṭĕ nim̐kanemi seduvayyā

(||aṁḍa||)
karam̐gili viṁpulanu kaḍunu lāliṁchidivi
śhirasūm̐sugŏni sannasesidivi
sarasamuna nīiṁti sinavarimāyanu
iravāya niṁtagaṁṭĕ nemiseduvayyā

(||aṁḍa||)
seri kām̐giliṁchidivi sĕkku seda nŏkkidivi
gāraviṁchi radulanum̐gaigŏṁṭivi
yīrīdi śhrīveṁkaḍeśha yīsadi mannanam̐ bŏṁdĕ
yeravvā ne liṁtagaṁṭĕ nemiseduvayyā