Amdamayina logamani ramguramgulumtaayani

అందమయిన లోకమని రంగురంగులుంటాయని
Year
Language

పల్లవి:

ఓ ఓ....

అందమయిన లోకమని రంగురంగులుంటాయని
అందరు అంటుంటారు రామ రామా..
అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మా..
చెల్లెమ్మా.. అందమైంది కానేకాదు చెల్లెమ్మా..

అందమయిన లోకమని రంగురంగులుంటాయని
అందరు అంటుంటారు రామ రామా ..
అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మా ..
చెల్లెమ్మా .. అందమైంది కానేకాదు చెల్లెమ్మా

ఆకలి ఆశలు ఈ లోకానికి మూలమమ్మా
ఆకలి ఆశలు ఈ లోకానికి మూలమమ్మా
ఆకలికి అందముందా రామ రామా ..
ఆశలకి అంతముందా చెప్పమ్మా .. చెల్లెమ్మా
ఆశలకి అంతముందా చెప్పమ్మా ..

అందమయిన లోకమని రంగురంగులుంటాయని
అందరు అంటుంటారు రామ రామా ..
అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మా ..
చెల్లెమ్మా.. అందమైంది కానేకాదు చెల్లెమ్మా..

చరణం 1:

గడ్డిమేసి ఆవు పాలిస్తుంది.. పాలు తాగి మనిషి విషమౌతాడు..
గడ్డిమేసి ఆవు పాలిస్తుంది.. పాలు తాగి మనిషి విషమౌతాడు
అది గడ్డి గొప్ప తనమా.. ఇది పాల దోష గుణమా..
అది గడ్డి గొప్ప తనమా.. ఇది పాల దోష గుణమా..
మనిషి చాల దొడ్డాడమ్మా చెల్లెమ్మ..
చెల్లెమ్మా.. తెలివి మీరి చెడ్డాడమ్మ చిన్నమ్మా..

అందమయిన లోకమని రంగురంగులుంటాయని
అందరు అంటుంటారు రామ రామా..
అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మా ..

చరణం 2:

ముద్దు గులాబీకి ముళ్ళుంటాయి.. మొగలిపువ్వులోన నాగుంటాది..
ముద్దు గులాబీకి ముళ్ళుంటాయి.. మొగలిపువ్వులోన నాగుంటాది..

ఒక మెరుపు వెంట పిడుగూ.. ఒక మంచిలోన చెడుగు
లోకమంతా ఇదే తీరు చెల్లెమ్మా
చెల్లెమ్మా.. లోతుకెళ్తే కథే వేరు పిచ్చమ్మా ..

అందమయిన లోకమని రంగురంగులుంటాయని
అందరు అంటుంటారు రామ రామా ..
అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మా .

చరణం 3:

డబ్బు పుట్టి మనిషీ చచ్చాడమ్మా.. పేదవాడు నాడే పుట్టాడమ్మా
డబ్బు పుట్టి మనిషీ చచ్చాడమ్మా.. పేదవాడు నాడే పుట్టాడమ్మా
ఆ ఉన్నవాడు తినడూ.. ఈ పేదను తిననివ్వడూ
కళ్ళు లేని భాగ్యశాలి నువ్వమ్మా ..
ఈ లోకం కుళ్ళు నీవు చూడలేవు చెల్లెమ్మా

అందమయిన లోకమని రంగురంగులుంటాయని
అందరు అంటుంటారు రామ రామా..
అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మా ..
చెల్లెమ్మా.. అందమైంది కానేకాదు చెల్లెమ్మా..

pallavi:

o o....

aṁdamayina logamani raṁguraṁguluṁṭāyani
aṁdaru aṁṭuṁṭāru rāma rāmā..
aṁta aṁdamaiṁdi kāne kādu sĕllĕmmā..
sĕllĕmmā.. aṁdamaiṁdi kānegādu sĕllĕmmā..

aṁdamayina logamani raṁguraṁguluṁṭāyani
aṁdaru aṁṭuṁṭāru rāma rāmā ..
aṁta aṁdamaiṁdi kāne kādu sĕllĕmmā ..
sĕllĕmmā .. aṁdamaiṁdi kānegādu sĕllĕmmā

āgali āśhalu ī logānigi mūlamammā
āgali āśhalu ī logānigi mūlamammā
āgaligi aṁdamuṁdā rāma rāmā ..
āśhalagi aṁtamuṁdā sĕppammā .. sĕllĕmmā
āśhalagi aṁtamuṁdā sĕppammā ..

aṁdamayina logamani raṁguraṁguluṁṭāyani
aṁdaru aṁṭuṁṭāru rāma rāmā ..
aṁta aṁdamaiṁdi kāne kādu sĕllĕmmā ..
sĕllĕmmā.. aṁdamaiṁdi kānegādu sĕllĕmmā..

saraṇaṁ 1:

gaḍḍimesi āvu pālistuṁdi.. pālu tāgi maniṣhi viṣhamaudāḍu..
gaḍḍimesi āvu pālistuṁdi.. pālu tāgi maniṣhi viṣhamaudāḍu
adi gaḍḍi gŏppa tanamā.. idi pāla doṣha guṇamā..
adi gaḍḍi gŏppa tanamā.. idi pāla doṣha guṇamā..
maniṣhi sāla dŏḍḍāḍammā sĕllĕmma..
sĕllĕmmā.. tĕlivi mīri sĕḍḍāḍamma sinnammā..

aṁdamayina logamani raṁguraṁguluṁṭāyani
aṁdaru aṁṭuṁṭāru rāma rāmā..
aṁta aṁdamaiṁdi kāne kādu sĕllĕmmā ..

saraṇaṁ 2:

muddu gulābīgi muḽḽuṁṭāyi.. mŏgalibuvvulona nāguṁṭādi..
muddu gulābīgi muḽḽuṁṭāyi.. mŏgalibuvvulona nāguṁṭādi..

ŏga mĕrubu vĕṁṭa piḍugū.. ŏga maṁchilona sĕḍugu
logamaṁtā ide tīru sĕllĕmmā
sĕllĕmmā.. lodugĕḽte kathe veru pichchammā ..

aṁdamayina logamani raṁguraṁguluṁṭāyani
aṁdaru aṁṭuṁṭāru rāma rāmā ..
aṁta aṁdamaiṁdi kāne kādu sĕllĕmmā .

saraṇaṁ 3:

ḍabbu puṭṭi maniṣhī sachchāḍammā.. pedavāḍu nāḍe puṭṭāḍammā
ḍabbu puṭṭi maniṣhī sachchāḍammā.. pedavāḍu nāḍe puṭṭāḍammā
ā unnavāḍu tinaḍū.. ī pedanu tinanivvaḍū
kaḽḽu leni bhāgyaśhāli nuvvammā ..
ī logaṁ kuḽḽu nīvu sūḍalevu sĕllĕmmā

aṁdamayina logamani raṁguraṁguluṁṭāyani
aṁdaru aṁṭuṁṭāru rāma rāmā..
aṁta aṁdamaiṁdi kāne kādu sĕllĕmmā ..
sĕllĕmmā.. aṁdamaiṁdi kānegādu sĕllĕmmā..