అందపు విభుఁడు దాను అంగన నేను
(॥పల్లవి॥)
అందపు విభుఁడు దాను అంగన నేను
కందువ కేఁగినఁ జాలుఁ గదిసీఁ బనులు
(॥అంద॥)
సేయనీవే చేఁతలెల్లా చెంగటఁ జూచేఁగాక
నాయాలకు వచ్చేనా నవ్వేనింతే
వేయిటిపై జవ్వాదివో వేగిరించనేల నాకు
దాయము వచ్చినప్పుడు తలఁపించేఁ బనులు
(॥అంద॥)
ఆడనీవె మాటలెల్లా అన్నియు వినేఁగాక
సూడువట్టఁబోయేనా చొక్కేనింతే
వోడఁగట్టుదూలమువో వోపనన నాకునేల
వీడె మిచ్చేయప్పుడైనా వెలయించేఁ బనులు
(॥అంద॥)
రానీవె తా నీడకు రవ్వగాఁ గూడేఁగాక
కానీకానిమ్మనేనా కైకొనే నింతే
యీనెపాన శ్రీవేంకటేశుఁడు గలసె నన్ను
మేనుమేనుఁ బెనఁగించి మెప్పించేఁ బనులు
(||pallavi||)
aṁdabu vibhum̐ḍu dānu aṁgana nenu
kaṁduva kem̐ginam̐ jālum̐ gadisīm̐ banulu
(||aṁda||)
seyanīve sem̐talĕllā sĕṁgaḍam̐ jūsem̐gāga
nāyālagu vachchenā navveniṁte
veyiḍibai javvādivo vegiriṁchanela nāgu
dāyamu vachchinappuḍu talam̐piṁchem̐ banulu
(||aṁda||)
āḍanīvĕ māḍalĕllā anniyu vinem̐gāga
sūḍuvaṭṭam̐boyenā sŏkkeniṁte
voḍam̐gaṭṭudūlamuvo vobanana nāgunela
vīḍĕ michcheyappuḍainā vĕlayiṁchem̐ banulu
(||aṁda||)
rānīvĕ tā nīḍagu ravvagām̐ gūḍem̐gāga
kānīgānimmanenā kaigŏne niṁte
yīnĕbāna śhrīveṁkaḍeśhum̐ḍu galasĕ nannu
menumenum̐ bĕnam̐giṁchi mĕppiṁchem̐ banulu