(॥పల్లవి॥)
అమరని మాటలేల ఆడేవు నీవు
తమకము గడునిండె దట్టమాయఁ గాంక్షలు
(॥అమ॥)
దాఁపురమేల సేసేవు తరుణితో నిందాఁకా
కాఁపురము సేయవా కంటిఁబో నేను
యేఁపకు నన్నిఁక నీవు యేలపెట్టుకొనే వాన
రాఁపాయ నీవలపు రచ్చకెక్కె సుద్దులు
(॥అమ॥)
పోల బొంకనేమిటికి పొలఁతితో నిందాఁకా
మేలములాడుకొనవా మెస్తిఁబో నిన్ను
జాలిఁబెట్ట కిఁక నీవు సారె నొడఁబరచకు
చాలుకొనెఁ దమకము జారఁజొచ్చె సిగ్గులు
(॥అమ॥)
వేసాలకేల లోఁగేవు వెలఁదిమీఁదట నిట్టె
సేసలెల్లాఁ బెట్టవా చేకొని నీవు
ఆసల శ్రీవేంకటేశ అట్టె నన్ను నేలితివి
పోసరించె వేడుకలు పొలుపొందె రతులు
(||pallavi||)
amarani māḍalela āḍevu nīvu
tamagamu gaḍuniṁḍĕ daṭṭamāyam̐ gāṁkṣhalu
(||ama||)
dām̐puramela sesevu taruṇido niṁdām̐kā
kām̐puramu seyavā kaṁṭim̐bo nenu
yem̐pagu nannim̐ka nīvu yelabĕṭṭugŏne vāna
rām̐pāya nīvalabu rachchagĕkkĕ suddulu
(||ama||)
pola bŏṁkanemiḍigi pŏlam̐tido niṁdām̐kā
melamulāḍugŏnavā mĕstim̐bo ninnu
jālim̐bĕṭṭa kim̐ka nīvu sārĕ nŏḍam̐barasagu
sālugŏnĕm̐ damagamu jāram̐jŏchchĕ siggulu
(||ama||)
vesālagela lom̐gevu vĕlam̐dimīm̐daḍa niṭṭĕ
sesalĕllām̐ bĕṭṭavā segŏni nīvu
āsala śhrīveṁkaḍeśha aṭṭĕ nannu nelidivi
posariṁchĕ veḍugalu pŏlubŏṁdĕ radulu