అమరఁ జెప్పే వప్పటి అందరితోడా నీవు
(॥పల్లవి॥)
అమరఁ జెప్పే వప్పటి అందరితోడా నీవు
తిమురుచు నీ సుద్దులు తేటపడకున్నవా
(॥అమ॥)
అందెలరవళితోడ ఆపె వెంటరాఁగాను
విందువలె నా చప్పుడు వినకున్నారా
కందువ సొమ్ముల మాణికములు వెలుఁగఁగాను
అందులో చీఁకటితప్పు అణఁచఁగ వచ్చునా
(॥అమ॥)
కోవిలఁకూతలతోడ కోరి యాపె మాటాడఁగా
ఆవల పొరుగువారు ఆలకించరా
వావిలి పుష్పకోమలి వాసనలు నిండుకోఁగా
మూవంకల నీచేఁతలు మూసి దాఁచవశమా
(॥అమ॥)
గుట్టున నీవ్దనె కొలువై ఆపె వుండఁగా
చుట్టరిక మందురును చూడకున్నారా
ఇట్టె శ్రీవెంకటేశ యేలితివి నన్ను నేఁడు
రట్టు తొల్లిటాపె పొందాఱడి కెక్కఁ దగదా
(||pallavi||)
amaram̐ jĕppe vappaḍi aṁdaridoḍā nīvu
timurusu nī suddulu teḍabaḍagunnavā
(||ama||)
aṁdĕlaravaḽidoḍa ābĕ vĕṁṭarām̐gānu
viṁduvalĕ nā sappuḍu vinagunnārā
kaṁduva sŏmmula māṇigamulu vĕlum̐gam̐gānu
aṁdulo sīm̐kaḍidappu aṇam̐sam̐ga vachchunā
(||ama||)
kovilam̐kūdaladoḍa kori yābĕ māḍāḍam̐gā
āvala pŏruguvāru ālagiṁcharā
vāvili puṣhpagomali vāsanalu niṁḍugom̐gā
mūvaṁkala nīsem̐talu mūsi dām̐savaśhamā
(||ama||)
guṭṭuna nīvdanĕ kŏluvai ābĕ vuṁḍam̐gā
suṭṭariga maṁdurunu sūḍagunnārā
iṭṭĕ śhrīvĕṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
raṭṭu tŏlliḍābĕ pŏṁdāṟaḍi kĕkkam̐ dagadā