Aluganu seyanu aaradi nela petteene

అలుగను సేయను ఆరడి నేల పెట్టీనే
Language

(॥పల్లవి॥)
అలుగను సేయను ఆరడి నేల పెట్టీనే
చెలియ నీవైనా బుద్ది చెప్పవే యీతనికి

(॥అలు॥)
మోము దప్పక చూచితి ముచ్చటతో నవ్వితి
ప్రేమముతో మాఁటలాడి పీఁట వెట్టితి
కామించి తా వేఁడుకొంటే కానిమ్మని ఇయ్యకొంటి
యేమిసేయుమనీనే యింకాఁదాను

(॥అలు॥)
వీడెము చేతికిచ్చి వెసఁ బానుపు వేసితి
పాడి పాడి వేగినంతా పదా లొత్తితి
వాడుదేర నిట్టె యాలవట్టమూను విసరితి
యీడువెట్టుకొని యింకా నెంత వేఁడుకొనీనే

(॥అలు॥)
చేతులెత్తి మొక్కితి సేవలెల్లాఁ జేసితి
కాతరాన నిమ్మపండు కానుకిచ్చితి
యీతల శ్రీవేంకటేశుఁ డిన్నిటాను నన్నుఁగూడె
యేతులు నే నెరఁగను యేల రట్టు సేసీనే

(||pallavi||)
aluganu seyanu āraḍi nela pĕṭṭīne
sĕliya nīvainā buddi sĕppave yīdanigi

(||alu||)
momu dappaga sūsidi muchchaḍado navvidi
premamudo mām̐ṭalāḍi pīm̐ṭa vĕṭṭidi
kāmiṁchi tā vem̐ḍugŏṁṭe kānimmani iyyagŏṁṭi
yemiseyumanīne yiṁkām̐dānu

(||alu||)
vīḍĕmu sedigichchi vĕsam̐ bānubu vesidi
pāḍi pāḍi veginaṁtā padā lŏttidi
vāḍudera niṭṭĕ yālavaṭṭamūnu visaridi
yīḍuvĕṭṭugŏni yiṁkā nĕṁta vem̐ḍugŏnīne

(||alu||)
sedulĕtti mŏkkidi sevalĕllām̐ jesidi
kādarāna nimmabaṁḍu kānugichchidi
yīdala śhrīveṁkaḍeśhum̐ ḍinniḍānu nannum̐gūḍĕ
yedulu ne nĕram̐ganu yela raṭṭu sesīne