అలుకలు దీరెను అంగన నీకు మొక్కెను
(॥పల్లవి॥)
అలుకలు దీరెను అంగన నీకు మొక్కెను
వెలయఁగఁ జెలికి విడె మియ్యరాదా
(॥అలు॥)
నగమెంత నవ్వేవు నాలి యంత సేసేవు
జిగి నాపె చెప్పినట్లు సేయరాదా
మొగ మెందాఁకాఁ జూచేవుముట్టిముట్టేమాడేవు
వెగటుదీరఁ జేతికి విడె మియ్యదా
(॥అలు॥)
మాట లెంతేశాడేవు మనపసు లేలొరసేవు
యీటున నీకెకుఁజనవియ్యరాదా
పాటలెన్ని వాడేవు పరాకేల సేసేవు
వేటుఁబువ్వుల చేతికి విడెమియ్యరాదా
(॥అలు॥)
మక్కువెంత సేసేవు మర్మమేమి యంటేవు
పిక్కటిల్ల నిఁక సేసవెట్టరాదా
గక్కన శ్రీవేంకటేశ కలసితి వీకెనిట్టె
వెక్కసమై చేతికి విడెమియ్యరాదా
(||pallavi||)
alugalu dīrĕnu aṁgana nīgu mŏkkĕnu
vĕlayam̐gam̐ jĕligi viḍĕ miyyarādā
(||alu||)
nagamĕṁta navvevu nāli yaṁta sesevu
jigi nābĕ sĕppinaṭlu seyarādā
mŏga mĕṁdām̐kām̐ jūsevumuṭṭimuṭṭemāḍevu
vĕgaḍudīram̐ jedigi viḍĕ miyyadā
(||alu||)
māḍa lĕṁteśhāḍevu manabasu lelŏrasevu
yīḍuna nīgĕgum̐janaviyyarādā
pāḍalĕnni vāḍevu parāgela sesevu
veḍum̐buvvula sedigi viḍĕmiyyarādā
(||alu||)
makkuvĕṁta sesevu marmamemi yaṁṭevu
pikkaḍilla nim̐ka sesavĕṭṭarādā
gakkana śhrīveṁkaḍeśha kalasidi vīgĕniṭṭĕ
vĕkkasamai sedigi viḍĕmiyyarādā