పల్లవి:
అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచిందా నీ తీరుగా
అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా
భూమి కనలేదు ఇన్నాళ్ళుగా ఈమె లా ఉన్న ఏ పోలిక
అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా
అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచిందా నీ తీరుగా
చరణం 1:
కన్యాదానంగా ఈ సంపద చేపట్టే ఆ వరుడు శ్రీహరి కాడా
పొందాలనుకున్నా పొందే వీలుందా అందరికి అందనిది ఈ సుందరి నీడ
ఇందరి చేతులు పంచిన మమత పచ్చగ పెంచిన పూలత
నిత్యం విరిసే నందనమవదా
అందానికే అందమనిపించగా దిగి వచ్చెనో ఏమో దివి కానుక
అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా
చరణం 2:
తన వయ్యారంతో ఈ చిన్నది లాగిందో ఎందరిని నిలబడనీకా
ఎన్నో ఒంపుల్తో పొంగే ఈ నది తనేమదిని ముంచిందో ఎవరికి ఎరుక
తొలిపరిచయమొక తియ్యని కలగా నిలిపిన హృదయమే సాక్షిగా
ప్రతి జ్ఞాపకం దీవించగా చెలి జీవితం వెలిగించగా
అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా
pallavi:
allaṁta dūrāla ā tāraga kaḽḽĕduḍa nilisiṁdā nī tīrugā
arudaina sinnārigā kovĕllo deverigā guṁḍĕllo kŏluvuṁḍagā
bhūmi kanaledu innāḽḽugā īmĕ lā unna e poliga
arudaina sinnārigā kovĕllo deverigā guṁḍĕllo kŏluvuṁḍagā
allaṁta dūrāla ā tāraga kaḽḽĕduḍa nilisiṁdā nī tīrugā
saraṇaṁ 1:
kanyādānaṁgā ī saṁpada sebaṭṭe ā varuḍu śhrīhari kāḍā
pŏṁdālanugunnā pŏṁde vīluṁdā aṁdarigi aṁdanidi ī suṁdari nīḍa
iṁdari sedulu paṁchina mamada pachchaga pĕṁchina pūlada
nityaṁ virise naṁdanamavadā
aṁdānige aṁdamanibiṁchagā digi vachchĕno emo divi kānuga
arudaina sinnārigā kovĕllo deverigā guṁḍĕllo kŏluvuṁḍagā
saraṇaṁ 2:
tana vayyāraṁto ī sinnadi lāgiṁdo ĕṁdarini nilabaḍanīgā
ĕnno ŏṁpuldo pŏṁge ī nadi tanemadini muṁchiṁdo ĕvarigi ĕruga
tŏlibarisayamŏga tiyyani kalagā nilibina hṛdayame sākṣhigā
pradi jñābagaṁ dīviṁchagā sĕli jīvidaṁ vĕligiṁchagā
allaṁta dūrāla ā tāraga kaḽḽĕduḍa nilisiṁdā ī tīrugā