Allaa shree raamaa

అల్లా శ్రీ రామా
Year
Language

పల్లవి:

అల్లా ఆ ఆ ఆ...

శ్రీరామా ఆ .....

శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడూ
కళ్యాణ గుణగణుడు కరుణా ఘనాఘనుడు ఎవడూ..
అల్లా తత్వమున అల్లారుముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడూ
ఆనందనందనుడు అమృతరసచందనుడు రామచంద్రుడుకాక ఇంకెవ్వడూ

తాగరా శ్రీరామ నామామృతం
ఆ నామమే దాటించు భవసాగరం
తాగరా శ్రీరామ నామామృతం
ఆ నామమే దాటించు భవసాగరం...

చరణం 1:

ఏ మూర్తి మూడుమూర్తులుగ వెలసిన మూర్తి
ఏ మూర్తి ముజ్జగంబుల మూలమౌమూర్తి
ఏ మూర్తి శక్తిచైతన్య మూర్తీ..
ఏ మూర్తి నిఖిలాండ నిత్యసత్యస్పూర్తి
ఏ మూర్తి నిర్వాణ నిజధర్మసమవర్తి
ఏ మూర్తి జగదేక చక్రవర్తీ...
ఏ మూర్తి ఘనమూర్తి ఏ మూర్తి గుణకీర్తి
ఏ మూర్తి అడగించు జన్మజన్మల ఆర్తి
ఆ మూర్తి ఏ మూర్తి యునుగాని రసమూర్తి
ఆ మూర్తి శ్రీరామ చంద్రమూర్తీ...

తాగరా...ఆ..ఆ.. తాగరా శ్రీరామ నామామృతం
ఆ నామమే దాటించు భవసాగరం ఊఁ.. ఊఁ.. ఊఁ..

చరణం 2:

పా పా ప మపనీప మపనీప మపసనిప మా పా మా - శ్రీ రా మా
పా పా ప మపనీని పనిసాస నిరిసనిప
మా పా ని మ ప మ - కోదండ రామా
మపనిసరిసాని పానీపామా - సీతారామా
మపనిసరిసారి సరిమరిస నిపమా - ఆనందరామా

మా మా రిమరిమరి సరిమా
రా మా జయరామా
సరిమా - రామా
సపమా - రామా
పా......వన నామా

ఏ వేల్పు ఎల్లవేల్పులును గొల్చెడి వేల్పు
ఏ వేల్పు ఏడేడులోకాలకే వేల్పు
ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పూ
ఆ... ఆ... ఆ...
ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు
ఏ వేల్పు నిగమనిగమాలన్నిటిని తెల్పు
ఏ వేల్పు నింగి నేలలను గల్పూ
ఏవేల్పు ద్యుతి గొల్పు
ఏ వేల్పు మరుగొల్పు
ఏ వేల్పు దేమల్పు లేని గెలుపూ
ఏ వేల్పు సీతమ్మ వలపుతలపులనేల్పు
ఆ వేల్పు దాసానుదాసులకు కైమోడ్పు

తాగరా... ఆ.. ఆ.. తాగరా శ్రీరామ నామామృతం
ఆ నామమే దాటించు భవసాగరం ఊఁ.. ఊఁ.. ఊఁ..

pallavi:

allā ā ā ā...

śhrīrāmā ā .....

śhubhagaruḍu surusiruḍu bhavaharuḍu bhagavaṁtuḍĕvaḍū
kaḽyāṇa guṇagaṇuḍu karuṇā ghanāghanuḍu ĕvaḍū..
allā tatvamuna allārumuddugā alarāru aṁdāla saṁdruḍĕvaḍū
ānaṁdanaṁdanuḍu amṛtarasasaṁdanuḍu rāmasaṁdruḍugāga iṁkĕvvaḍū

tāgarā śhrīrāma nāmāmṛtaṁ
ā nāmame dāḍiṁchu bhavasāgaraṁ
tāgarā śhrīrāma nāmāmṛtaṁ
ā nāmame dāḍiṁchu bhavasāgaraṁ...

saraṇaṁ 1:

e mūrdi mūḍumūrduluga vĕlasina mūrdi
e mūrdi mujjagaṁbula mūlamaumūrdi
e mūrdi śhaktisaidanya mūrdī..
e mūrdi nikhilāṁḍa nityasatyaspūrdi
e mūrdi nirvāṇa nijadharmasamavardi
e mūrdi jagadega sakravardī...
e mūrdi ghanamūrdi e mūrdi guṇagīrdi
e mūrdi aḍagiṁchu janmajanmala ārdi
ā mūrdi e mūrdi yunugāni rasamūrdi
ā mūrdi śhrīrāma saṁdramūrdī...

tāgarā...ā..ā.. tāgarā śhrīrāma nāmāmṛtaṁ
ā nāmame dāḍiṁchu bhavasāgaraṁ ūm̐.. ūm̐.. ūm̐..

saraṇaṁ 2:

pā pā pa mabanība mabanība mabasaniba mā pā mā - śhrī rā mā
pā pā pa mabanīni panisāsa nirisaniba
mā pā ni ma pa ma - kodaṁḍa rāmā
mabanisarisāni pānībāmā - sīdārāmā
mabanisarisāri sarimarisa nibamā - ānaṁdarāmā

mā mā rimarimari sarimā
rā mā jayarāmā
sarimā - rāmā
sabamā - rāmā
pā......vana nāmā

e velbu ĕllavelbulunu gŏlsĕḍi velbu
e velbu eḍeḍulogālage velbu
e velbu niṭṭūrbu ilanu nilbū
ā... ā... ā...
e velbu nikhila kaḽyāṇamula kalagalbu
e velbu nigamanigamālanniḍini tĕlbu
e velbu niṁgi nelalanu galbū
evelbu dyudi gŏlbu
e velbu marugŏlbu
e velbu demalbu leni gĕlubū
e velbu sīdamma valabudalabulanelbu
ā velbu dāsānudāsulagu kaimoḍpu

tāgarā... ā.. ā.. tāgarā śhrīrāma nāmāmṛtaṁ
ā nāmame dāḍiṁchu bhavasāgaraṁ ūm̐.. ūm̐.. ūm̐..