Alivenee.. nee roobamu

అలివేణీ.. నీ రూపము
Year
Language

పల్లవి:

అలివేణీ .. నీ రూపము మలచిన సుందర శిల్పము
విరిబోణీ.. నీ అందము అరవిరిసిన అరవిందము

చరణం 1:

చిరుగాలికి ఊగిన ముంగురుల మరులు కనుగొంటిని
ఎదపొంగుల దాచిన పై ఎద గుసగుసలే వింటిని

చరణం 2:

నీ చెక్కిలి అద్దమున నీడ చూసుకోనా
నీ బింబాధరమున తేనీయలు దోచుకోనా

చరణం 3:

నీ అగమ్య లావణ్య ధునితరంగ డోళలందు
పగలు ఎరుగక రేయి ఎరుగక పరవశించిపోనా .. పరవశించి పోనా !

pallavi:

aliveṇī .. nī rūbamu malasina suṁdara śhilbamu
viriboṇī.. nī aṁdamu aravirisina araviṁdamu

saraṇaṁ 1:

sirugāligi ūgina muṁgurula marulu kanugŏṁṭini
ĕdabŏṁgula dāsina pai ĕda gusagusale viṁṭini

saraṇaṁ 2:

nī sĕkkili addamuna nīḍa sūsugonā
nī biṁbādharamuna tenīyalu dosugonā

saraṇaṁ 3:

nī agamya lāvaṇya dhunidaraṁga ḍoḽalaṁdu
pagalu ĕrugaga reyi ĕrugaga paravaśhiṁchibonā .. paravaśhiṁchi ponā !