Aligina velane soodaali

అలిగిన వేళనె చూడాలి
Year
Language

పల్లవి:

అలిగిన వేళనె చూడాలి గోకులకృష్ణుని అందాలు
అలిగిన వేళనె చూడాలి
రుసరుసలాడే చూపుల లోనే
రుసరుసలాడే చూపుల లోనే ముసిముసి నవ్వుల చందాలు
అలిగిన వేళనె చూడాలి

చరణం 1:

అల్లన మెల్లన నల్లపిల్లి వలె వెన్నను దొంగిల గజ్జెలు ఘల్లన (2)
తల్లి మేలుకొని దొంగను జూచి ఆ... (2) అల్లరిదేమని అడిగినందుకే
అలిగిన వేళనె చూడాలి గోకులకృష్ణుని అందాలు
అలిగిన వేళనె చూడాలి

చరణం 2:

మోహనమురళీగానము వినగా తహతహలాడుచు తరుణులు రాగా (2)
దృష్టి తగులునని జడిసి యశోద (2) తనను చాటుగా దాచినందుకే
అలిగిన వేళనె చూడాలి

pallavi:

aligina veḽanĕ sūḍāli gogulakṛṣhṇuni aṁdālu
aligina veḽanĕ sūḍāli
rusarusalāḍe sūbula lone
rusarusalāḍe sūbula lone musimusi navvula saṁdālu
aligina veḽanĕ sūḍāli

saraṇaṁ 1:

allana mĕllana nallabilli valĕ vĕnnanu dŏṁgila gajjĕlu ghallana (2)
talli melugŏni dŏṁganu jūsi ā... (2) allaridemani aḍiginaṁduge
aligina veḽanĕ sūḍāli gogulakṛṣhṇuni aṁdālu
aligina veḽanĕ sūḍāli

saraṇaṁ 2:

mohanamuraḽīgānamu vinagā tahadahalāḍusu taruṇulu rāgā (2)
dṛṣhṭi tagulunani jaḍisi yaśhoda (2) tananu sāḍugā dāsinaṁduge
aligina veḽanĕ sūḍāli